దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొంతకాలంగా రోజువారీ కేసులు 12 వేల లోపు నమోదవుతుండగా, గత నాలుగు రోజులుగా 13 వేల పైచిలుకు రికార్డవుతున్నాయి.
Coronavirus : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొంతకాలంగా రోజువారీ కేసులు 12 వేల లోపు నమోదవుతుండగా, గత నాలుగు రోజులుగా 13 వేల పైచిలుకు రికార్డవుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటీ 10 లక్షలకు పైగా నమోదయ్యాయి.
దేశంలో గడచిన 24 గంటల్లో మొత్తం 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కోవిడ్-19 మృతి కూడా చోటుచేసుకోలేదు. అయితే, ప్రస్తుతం 1,46,907 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో కొత్తగా 13,742 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 14,037 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,10,46,432 మందికి కరోనా బారినపడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, మహమ్మారి ధాటికి దేశంలో 1,56,742 మంది ప్రాణాలను కోల్పోయారు.
గడచిన వారం రోజుల వ్యవధిలో దేశంలోని 12 రాష్ట్రాల్లో రోజుకు సగటున వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటక, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో గడచిన వారంలో రోజుకు 4,000 కరోనా కేసులు నమోదవుతున్నాయి.
కాగా గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మృతి కూడా నమోదు కాలేదు. గుజరాత్, హర్యానా , రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, చండీగఢ్, అసోం, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్, లధాఖ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అండమాన్, నికోబార్ దీవులు, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో ఒక్క కరోనా మృతి నమోదు కాలేదు. ఇక, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10,736,433 మంది కరోనా వైరస్ మహమ్మారిని జయించి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. భారత్‌లో టీకా పంపిణీ 39వ రోజుకు చేరుకుంది. కాగా, ఫిబ్రవరి 23 నాటికి దేశంలో మొత్తం 4,20,046 మందికి కరోనా టీకాలు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
A total of 21,38,29,658 samples tested for #COVID19 up to 24th February 2021. Of these, 7,93,383 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/DY8MbRaBR4
— ANI (@ANI) February 25, 2021
ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ (63,090) రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా… బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా (2342) టాప్‌లో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్ (1370), మెక్సికో (429), ఇండియా, బ్రిటన్ (548) తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి.
Read Also… ఇవాళ విచారణకు రానున్న నీరవ్ మోదీ కేసు.. భారత్‌కు అప్పగింతపై బ్రిటన్ కోర్టు తుది తీర్పు..