Black Magic: ఉదయాన్నే నిద్రలేచి తలుపులు తెరిచిన మహిళ.. ఎదురుగా మనిషి పుర్రె, ఎముకలు.. కర్నూల్‌లో హర్రర్ సీన్..

Black Magic: కర్నూలు‌ జిల్లాలో హర్రర్ సీన్ హడలెత్తించింది. ఓ మహిళ తెల్లవారు జామున నిద్రలేచి తలుపులు తెరవగానే..

Black Magic: ఉదయాన్నే నిద్రలేచి తలుపులు తెరిచిన మహిళ.. ఎదురుగా మనిషి పుర్రె, ఎముకలు.. కర్నూల్‌లో హర్రర్ సీన్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 24, 2021 | 10:28 PM

Black Magic: కర్నూలు‌ జిల్లాలో హర్రర్ సీన్ హడలెత్తించింది. ఓ మహిళ తెల్లవారు జామున నిద్రలేచి తలుపులు తెరవగానే హర్రర్ సీన్ హడలెత్తించింది. గుమ్మం ముందు మనిషి పుర్రె, ఎముకలు, నిమ్మకాయలు కనిపించాయి. దాంతో ఆమె గట్టిగా కేకలు పెట్టింది. వివరాల్లోకెళితే.. కర్నూలు నగర శివారులోని మునగలపాడులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు రాములమ్మ అనే మహిళ ఇంటి ముందు పసుపు, కుంకుమ చల్లి మనిషి పుర్రె, ఎముకలు, నిమ్మకాయలు పెట్టి క్షుద్రపూజలు చేశారు.

ఇంట్లో నిద్రించిన రాములమ్మ ఉదయాన్నే తలుపులు తెరువగా.. ఇంటి ముందు తలపుర్రె, మనిషి ఎముకలు పెట్టి క్షుద్ర పూజ చేసి ఉండటాన్ని గమనించింది. వెంటనే పెద్దగా కేకలు పెట్టింది. స్థానికులు వచ్చి చూసి షాక్ అయ్యారు. వారు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని పోలీసులు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షుద్ర పూజ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా, తమకు సరిపోని వాళ్లే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని బాధితురాలు రాములమ్మ ఆరోపిస్తోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

విజయ్ హజారే ట్రోఫీలో విజృంభించిన యూపీ బౌలర్.. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టేశాడు..

ఎంత మంది పిల్లలో నాకే తెలియదు.. సంచలన నిజాలు వెల్లడించిన సాకర్ దిగ్గజం..