Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం..
Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ముస్తాబవుతోంది.
Srisailam Temple: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ముస్తాబవుతోంది. ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి4 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తం 11 రోజులు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు గానూ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బుధవారం నాడు ఆలయ పరిసరాల్లో వాహనాల పార్కింగ్ కోం ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.
యజ్ఞవాటిక వద్ద (నిర్మాణంలో ఉన్న గణేశసదనానికి ఎదురుగా) తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. ఇక యజ్ఞవాటిక వద్ద, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడమవైపు ప్రదేశం, ఘంటామఠం వెనుకభాగం, దేవస్థానం ఆగమపాఠశాల ఎదురుగాగల ఆరుబయలు ప్రాంతాలలో కార్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయబడుతున్నాయని చెప్పారు. పార్కింగ్ ప్రదేశాలలో ఇప్పటికే ప్రారంభించిన జంగిల్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. ఆయా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవలసిన దారులు, పార్కింగ్ స్థలాలు స్పష్టంగా తెలిసేవిధంగా ఫ్లెక్సీబోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Also read:
ఎంత మంది పిల్లలో నాకే తెలియదు.. సంచలన నిజాలు వెల్లడించిన సాకర్ దిగ్గజం..
విజయ్ హజారే ట్రోఫీలో విజృంభించిన యూపీ బౌలర్.. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టేశాడు..