Fake Challans: బోగస్ చలానాలతో పక్కదారి పట్టిన లక్షల రూపాయలు.. ఏపీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కొనసాగుతున్న సోదాలు

అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నకిలీ చలానాలు కలకలం రేపుతున్నాయి. సాఫ్ట్‌వేర్ లొసుగులు ఆసరా చేసుకున్న కేటుగాళ్లు.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.

Fake Challans: బోగస్ చలానాలతో పక్కదారి పట్టిన లక్షల రూపాయలు.. ఏపీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కొనసాగుతున్న సోదాలు
Ap Sub Registrar Offices
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 10, 2021 | 7:13 PM

అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నకిలీ చలానాలు కలకలం రేపుతున్నాయి. సాఫ్ట్‌వేర్ లొసుగులు ఆసరా చేసుకున్న కేటుగాళ్లు.. ప్రభుత్వ అధికారులు, ఎజెంట్లు కుమ్మక్కై సర్కార్ ఆదాయానికే గండి కొట్టేందుకు ప్రయత్నించారు. రాయలసీమ జిల్లాల్లో ఫేక్ చలానాల భాగోతం బయటపడటంతో.. గత గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఐదో రోజున బయటపడుతున్నాయి.

తాజాగా విజయనగరం జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. బోగస్ చలానాలతో లక్షలాది రూపాయలు పక్కదారి పట్టాయన్న ఆరోపణలతో అధికారుల విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ సుజనా అధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పలు బోగస్ చలానాలను గుర్తించినట్లు సమాచారం. ఫేక్ చలానాలతో లక్షల రూపాయలు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. తనిఖీలు పూర్తయితే తప్ప పూర్తి వివరాలు చెప్పలేమని అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే, ఈ ఏడాది జులైలో కర్నూలు జిల్లా నంద్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నిర్వహించిన డాక్యుమెంటేషన్లలో పది దస్తావేజులకు సంబంధించి నకిలీ చలానాలతో లావాదేవీలు జరిగినట్లు స్పష్టమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నంద్యాల కార్యాలయంలో సోమవారం పది నకిలీ చలానాలు వెలుగులోకి వచ్చాయి. 2018 నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ విధానం అమలులోకి రావడంతోనే అక్రమాలకు తెర లేచింది. ఈ ఏడాది ప్రథమార్థం నుంచి భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది.

అయితే. ఈ చలానాలు భూముల రిజిస్ట్రేషన్ల స్టాంపు డ్యూటీ మొత్తానికి సంబంధించినవి కావని తెలుస్తోంది. పురపాలకలకు చెల్లించాల్సిన పన్నుతోపాటు ఇతర రుసుములకు సంబంధించిన గోల్‌మాల్‌గా నిర్ధారణ అయింది. రూ.4,500 చెల్లించాల్సిన చోట రూ.45 చెల్లించి నామమాత్రపు చలానాతో పక్కదారి పట్టించినట్లు వెల్లడైంది. డాక్యుమెంట్ల వివరాలను పూర్తి స్థాయిలో విచారించేందుకు సాంకేతిక పరిజ్ఞానం సహకరించకపోవడంతో సూత్రధారులు ఎవరో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇక, అక్రమాలను కట్టడి చేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్‌ స్టాంపు రుసుంను బ్యాంకులో చెల్లించిన వెంటనే సీఎఫ్‌ఎంఎస్‌లో జమవుతుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ సదరు కొనుగోలుదారుడి రిజిస్ట్రేషన్‌ చేసేటప్పుడు కట్టిన మొత్తం డిస్‌ప్లే అవటంతోపాటు రిజిస్ట్రేషన్‌ అప్లికేషన్‌లో దానికంతట అదే నమోదవుతుందని ఆశాఖ డీఐజీ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Read Also… కోవిడ్ చలాన్లు జారీ చేస్తున్న అధికారులపై ఇద్దరు మహిళల దాడి.. జుట్టు పట్టుకుని..రచ్చ..రచ్చ