Crime News: ఘోరం.. సాంబార్​ రుచిగా లేదని.. తల్లి, సోదరి హత్య

మద్యం మనుషులతో ఎలాంటి క్రూరమైన పనులు చేయిస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. అవును.. తాజాగా మద్యం తాగిన మత్తులో ఓ వ్యక్తి  క్రూరంగా ప్రవర్తించాడు.

Crime News: ఘోరం.. సాంబార్​ రుచిగా లేదని.. తల్లి, సోదరి హత్య
Murders
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 14, 2021 | 5:51 PM

మద్యం మనుషులతో ఎలాంటి క్రూరమైన పనులు చేయిస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. అవును.. తాజాగా మద్యం తాగిన మత్తులో ఓ వ్యక్తి  క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో సాంబార్ రుచిగా చేయలేదన్న చిన్న సాకుతో.. తల్లి, సోదరిపై కాల్పులు జరిపారు. దీంతో వారు స్పాట్‌లోనే చనిపోయారు. ఈ అత్యంత దారుణ ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. మృతులను సిద్ధాపుర్ తాలుకాలోని దోడ్​మణె గ్రామానికి చెందిన పార్వతీ నారాయణ హస్లార్​(42), ఆమె కుమార్తె రమ్యా నారాయణ హస్లార్​(19)గా పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే..  పార్వతి కుమారుడు మంజునాథ హస్లార్​(24).. మద్యానికి విపరీతంగా బానిసయ్యాడు. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి తాగుడు మీదే ద్యాస ఉండేది. బుధవారం రాత్రి అన్నం వడ్డించిన సమయంలో… సాంబార్ రుచిగా లేదంటూ తల్లి, సోదరితో అతడు గొడవకు దిగాడు. వంట వండటం కూడా రావడం లేదు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో తల్లి, సోదరి కూడా ఘాటుగా బదులివ్వడంతో..  కోపోద్రిక్తుడైన అతడు.. నాటు తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో మంజునాథ తండ్రి ఇంట్లో లేడని పోలీసులు చెప్పారు. దీనిపై సిద్ధాపుర్ పోలీస్ స్టేషన్​లో అతడు కంప్లైంట్ చేశాడని పేర్కొన్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. మద్యపానం వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ ఘటన కళ్లకు కట్టింది. ఇటు అయినవాళ్లని కోల్పోయి.. అతడు ఇకపై జైల్లో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి మంజునాథ‌కు వచ్చింది.

Also Read: ఆగని ప్రకంపనలు.. #justasking అంటూ ‘మా’ ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ లేఖ

దసరా పండుగ వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం…