Crime News: కానిస్టేబుల్ ఘాతుకం.. బాలికపై ఆరు నెలలుగా అత్యాచారం.. ఎలా బయటపడిందంటే?

అతను బాధ్యత గల వృత్తిలో ఉన్నాడు.. కానీ అతడు చేసి పని మాత్రం దరిద్రంగా ఉంది....

Crime News: కానిస్టేబుల్ ఘాతుకం.. బాలికపై ఆరు నెలలుగా అత్యాచారం.. ఎలా బయటపడిందంటే?
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Sep 29, 2021 | 12:15 PM

అతను బాధ్యత గల వృత్తిలో ఉన్నాడు.. కానీ అతడు చేసి పని మాత్రం దరిద్రంగా ఉంది. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక ఇంటికి కేసు విచారణ పేరుతో వెళ్లిన ఓ కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరు నెలలుగా బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. బాలిక అనారోగ్యానికి గురి కావటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు ఆ కానిస్టేబుల్‎ను నిలదీశారు. అతడు.. అబార్షన్ చేయించుకోవాలని చెప్పి కొంత మొత్తం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే మీ నష్టమంటూ బెదిరించాడు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికపై రెండేళ్ల కింద అత్యాచారం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసు విచారణ పేరుతో శివరాజ్ అనే కానిస్టేబుల్ బాధిత బాలిక ఇంటికి తరుచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆరు నెలల నుంచి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక శరీరంలో మార్పులతో కుటుంబ సభ్యులు వైద్యులకు చూపించారు. బాలిక గర్భం దాల్చిందని వైద్యులు తెలిపారు. బాలికను తల్లిదండ్రులు నిలదీయటంతో కానిస్టేబుల్ తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. శివరాజ్ తనను పెళ్లిచేసుకుంటానని చెప్పాడని వెల్లడించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు శివరాజ్‌ని నిలదీశారు. కానీ అతడు అబార్షన్ చేయించుకోవాలని, ఖర్చుల కింద ఆ కుటుంబానికి రూ. 35,000 ఇచ్చాడు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. శివరాజ్‌పై పోక్సో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాధిత బాలిక మంగళవారం పోలీసులకు తన వాంగ్మూలం ఇవ్వనుంది.

Read Also.. Illegal Affair: నలుగురు పిల్లల తల్లి.. భర్త ఊరెళ్లాడని.. లవర్‎ను పిలిచింది.. చివరకు అడ్డంగా..

Andhra Pradesh: ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. పండంటి బిడ్డకు జన్మినిచ్చిన తల్లికి కాసేపటికే షాక్