Srinagar Grenade Attack: శ్రీనగర్ లాల్‌చౌక్ వద్ద ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి.. ఐదుగురు పౌరులకు తీవ్ర గాయాలు..!

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మంగళవారం భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రనేడ్‌ను ప్రయోగించారు. ఈ దాడిలో కొంతమంది పౌరులు గాయపడ్డారు.

Srinagar Grenade Attack: శ్రీనగర్ లాల్‌చౌక్ వద్ద ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి.. ఐదుగురు పౌరులకు తీవ్ర గాయాలు..!
Srinagar Grenade Attack
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 10, 2021 | 3:40 PM

సమాచారం. ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ.. హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. అయితే, లక్ష్యం తప్పిపోయి గ్రెనేడ్ రోడ్డుపై పడింది. ఈ పేలుడు ధాటికి ఐదుగురు స్థానిక పౌరులు గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. హఠాత్తు పరిణామంతో దాడికి పాల్పడ్డ వారికోసం ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టి, ఆపరేషన్ ప్రారంభించారు.

ఇదిలావుంటే, మంగళవారం ఉదయం, దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని జైన్‌పోరాలోని క్రాల్‌చక్ ప్రాంతంలో సీఆర్‌పిఎఫ్ పార్టీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ ఒకరు గాయపడ్డారు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఎవరూ గాయపడలేదని సీఆర్‌పీఎఫ్ డీఐజీ కిశోర్ ప్రసాద్ తెలిపారు.

Read Also….  Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ కి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి..కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్