కరాటే బెల్టుతో తల్లి గొంతు నులిమి చంపిన కూతురు.. చదువును అశ్రద్ధ చేస్తోందని మందలించినందుకు..
Crime News: మానవ సంబంధాలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. కక్షలు, కార్పణ్యాలు పెరిగిపోతున్నాయి. జన్మనిచ్చిన తమ తలిదండ్రుల పట్ల కొడుకులు, కూతుళ్లు అక్కడక్కడా రాక్షసులుగా మారుతున్నారు..
మానవ సంబంధాలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. కక్షలు, కార్పణ్యాలు పెరిగిపోతున్నాయి. జన్మనిచ్చిన తమ తలిదండ్రుల పట్ల కొడుకులు, కూతుళ్లు అక్కడక్కడా రాక్షసులుగా మారుతున్నారు. ఇందుకు ఉదాహరణగా నవీ ముంబైలో జరిగిన ఓ షాకింగ్ సంఘటన పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సిటీలో 15 ఏళ్ళ అమ్మాయి తన తల్లిని కరాటే బెల్టుతో గొంతు నులిమి హతమార్చింది. తన కూతురిని మెడిసిన్ చదివించాలనుకున్న ఆ తల్లి ఆ కూతురు చేతిలోనే మరణించింది. 40 ఏళ్ళ ఈ మహిళకు, ఆమె కూతురికి మధ్య ఎప్పుడూ చదువు విషయంలో గొడవ జరిగేదని తెలిసింది. నిన్ను డాక్టర్ని చేయాలని చదివిస్తుంటే నువ్వు స్టడీస్ మీద దృష్టి పెట్టడం లేదని ఆ తల్లి మందలిస్తూ వచ్చేదట ..దీనికి ఆ కూతురు కూడా ఎదురు సమాధానం చెప్పేదట.పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే ఆ అమ్మాయి ఇటీవల తన తల్లి తనను వేధిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దర్నీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
అయితే ఈ మధ్య ఇద్దరి మధ్యా మళ్ళీ తగవు ముదరడంతో ఆ టీనేజర్ తల్లి గొంతుకు కరాటే బెల్టు బిగించి హతమార్చింది. ఏమీ తెలియనట్టు ఆమె కింద పడి మరణించిందని పోలీసులకు తెలిపింది. అయితే ఫోరెన్సిక్ పరీక్షలో ఆమె గొంతుకు ఏదో బిగించడంవల్ల మరణించిందని తేలింది. పోలీసులకు అనుమానం వచ్చి ఆమె కూతురును ఇంటరాగేట్ చేయగా.. తానీ ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఆమెపై హత్యాభియోగం మోపారు.
మరిన్ని ఇక్కడ చూడండి : Taliban Live Video: తాలిబన్లు ఘాతుకం.. బిగుతుగా డ్రెస్ వేసుకుందని మహిళ హతం..