Prostitution: హైదరాబాద్ ఎస్ఆర్‎నగర్‎లో గుట్టుగా వ్యభిచారం.. అది తెలిసిన పోలీసులు ఏం చేశారంటే..

హైదరాబాద్ ఎస్ఆర్‎నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బంగ్లాదేశ్ జాతీయులు వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న..

Prostitution: హైదరాబాద్ ఎస్ఆర్‎నగర్‎లో గుట్టుగా వ్యభిచారం.. అది తెలిసిన పోలీసులు ఏం చేశారంటే..
Prostitution
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 07, 2021 | 9:31 PM

హైదరాబాద్ ఎస్ఆర్‎నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. బంగ్లాదేశ్ జాతీయులు వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్‏‎ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బాపునగర్ రోడ్‎లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరుగురు బంగ్లాదేశ్ జాతీయలను పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. వారితోపాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మరో వ్యక్తి ఉన్నారు. వీరు ఎలాంటి పత్రాలు లేకుండా బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికి తెలియకుండా గత కొద్ది రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. నిందితులను ఆరెస్ట్ చేసిన టాస్క్‏‎ఫోర్స్ పోలీసులు వారిని స్థానిక పోలీస్ స్టేషన్‎లో అప్పగించారు.

అయితే హైదరాబాద్‎లో ఎక్కడో ఓ చోట వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసినా మారడం లేదు. బయటకు వచ్చి మళ్లీ అదే వృత్తిని ఎంచుకుంటున్నారు. నగరంలో వ్యభిచారంతోపాటు డ్రగ్స్ దందా కొనసాగుతోంది. పోలీసులు నిత్యం ఎదో ఒక చోట గంజాయో లేక కొకైనో లేక ఇతర మత్తు పదార్థలు పట్టుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా నైజిరియాకు చెందిన కొంత మంది చదువుకోవడానికి రాష్ట్రానికి వచ్చి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also.. YouTube: డామిట్.. కథ అడ్డం తిరిగింది.. యూ ట్యూబ్ చూసి ఆ పని చేద్దామనుకున్నాడు.. కానీ..