Skeletons: వ్యాన్‌లో 28 అస్థిపంజరాలు.. మానవ ఎముకలను చూసి ఆశ్చర్యపోయిన భద్రతా దళాలు..
Skeletons: బిహార్ అరారియాలోని ఇండో-నేపాల్ సరిహద్దులో భద్రతా దళాలు ఓ వ్యాన్‌లో 28 ఆస్థిపంజరాలు కనుగొన్నారు. ఈ వ్యాన్‌ని
Skeletons: బిహార్ అరారియాలోని ఇండో-నేపాల్ సరిహద్దులో భద్రతా దళాలు ఓ వ్యాన్‌లో 28 ఆస్థిపంజరాలు కనుగొన్నారు. ఈ వ్యాన్‌ని మొదట జొగ్బానీ ప్రాంతంలో నేపాల్ ఆర్మ్స్ ఫోర్స్ గుర్తించారు. వెంటనే నేపాల్ సైనికులు దీని గురించి సరిహద్దులో ఉన్న (భారతీయ సరిహద్దులో) SSB అధికారులకు సమాచారం అందించారు. వాస్తవానికి ఈ అస్థిపంజరాలు పట్టుబడిన వ్యాన్ భారతదేశం నుంచే నేపాల్ సరిహద్దుకు చేరుకోవడం గమనార్హం.ఇన్ని అస్థిపంజరాలతో నిండిన వాహనం భారతదేశ సరిహద్దును దాటి, నేపాల్ సరిహద్దుకు ఎలా చేరుకుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. నేపాల్-భారతదేశం మధ్య ఈ సరిహద్దు గత కొంతకాలం కిందట తెరిచారు. అప్పటి నుంచి ఇక్కడ నేపాల్, భారతదేశం భద్రతా దళాలు గస్తీ కాస్తున్నాయి.
మానవ అస్థిపంజరాలతో నిండిన ఈ వ్యాన్ అక్టోబర్ 4 సాయంత్రం పట్టుబడింది. భారత సరిహద్దు దాటగానే వ్యాన్ నేపాల్ సరిహద్దుకు చేరుకుంది. అక్కడ నేపాల్ ఆర్మ్స్ ఫోర్స్ సిబ్బంది తనిఖీ కోసం దీనిని ఆపివేశారు. వ్యాన్ లోపల మనుషుల అస్థిపంజరాలు ఉండటం గమనించారు. నేపాల్ ఆర్మ్స్ ఫోర్స్ సిబ్బంది వాటిని లెక్కించినప్పుడు అవి 28 మగ అస్థి పంజరాలు అని తేల్చారు. ఇంత పెద్ద సంఖ్యలో అస్థిపంజరాలు ఇండియా నుంచి తమ సరిహద్దులోకి ఎలా వచ్చాయనేది నేపాల్ ఆర్మ్స్ ఫోర్స్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.
వెంటనే వారు సమీపంలో ఉన్న భారత భద్రతా సంస్థ SSB చెక్ పోస్ట్ వద్ద ఉన్న అధికారులకు సమాచారం అందించారు. ఎస్‌ఎస్‌బి బృందం సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా నేపాల్ ఆర్మ్ ఫోర్స్ సిబ్బంది మాటలు నిజమేనని తేలింది. మగ అస్థిపంజరాలలో తల (పుర్రె), మనుషుల తొడలు, ఇతర భాగాలు ఉన్నాయి. ఈ వ్యాన్ భారతదేశం నుంచి నేపాల్ సరిహద్దుకు ఎలా చేరుకుందని SSB అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.