Harbhajan Singh: టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఆ ఆటగాడికి స్థానం కల్పించాలి.. హర్భజన్ సింగ్ ట్విట్
అక్టోబర్ 17 నుంచి టీ 20 క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా మాజీ స్పీన్నర్ హర్భజన్ సింగ్ ఓ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. టీమిండియా జట్టులో యుజ్వేంద్ర చాహల్‌ని చేర్చాలని అభిప్రాయపడ్డారు...
అక్టోబర్ 17 నుంచి టీ 20 క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా మాజీ స్పీన్నర్ హర్భజన్ సింగ్ ఓ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. టీమిండియా జట్టులో యుజ్వేంద్ర చాహల్‌ని చేర్చాలని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 10 వరకు భారత జట్టును మార్చవచ్చని చెప్పారు. శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌తో సహా స్టాండ్‌బై జాబితాలో చాహల్ కూడా చేర్చితే బాగుటుందని అన్నారు. చాహల్ ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో చాహల్ కీలక పాత్ర పోషించాడు.
ఆర్సీబీ మొదటి ఐపీఎల్ టైటిల్ గెలవాలని 100 శాతం కోరుకుంటున్నట్లు చెప్పారు. చాహల్ పోస్టును హర్భజన్ రిట్వీట్ చేశాడు. “మీరు ఎప్పటిలాగే అత్యుత్తమంగా ఉన్నారని.. దానిని కొనసాగించండి. మీరు సరైన వేగంతో బౌలింగ్ చేస్తున్నారని నిర్ధరించుకోండి .. చాలా నెమ్మదిగా కాదు సరే .. టీ 20 వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియాలో మిమ్మల్ని చూడాలని ఆశిస్తూ ఛాంపియన్ బౌలర్” హర్భజన్ రాసుకొచ్చారు.
Read Also.. IPL 2021, CSK vs PBKS: మైదానంలో చెన్నై ఆటగాడి లవ్ ట్రాక్.. వైరల్‌గా మారిన ప్రపోజ్ వీడియో