Google Pay App: గూగుల్‌ పేలో ఆ సేవలు కష్టమే..! మీరు కూడా తెలుసుకోండి..(వీడియో)

కస్టమర్ల కోసం గూగూల్‌ కూడా ఎన్నో సర్వీసులను అందిస్తోంది. యూపీఐ విభాగంలో పలు సేవలను అందించాలనే గూగుల్‌ ప్రణాళిక ఆదిలోనే నిలిచిపోయింది. గతంలో గూగుల్‌పే యూజర్లకు ప్లెక్స్‌ సర్వీసులను అందించాలని భావించింది.

Google Pay App: గూగుల్‌ పేలో ఆ సేవలు కష్టమే..! మీరు కూడా తెలుసుకోండి..(వీడియో)

|

Updated on: Oct 07, 2021 | 10:18 PM

కస్టమర్ల కోసం గూగూల్‌ కూడా ఎన్నో సర్వీసులను అందిస్తోంది. యూపీఐ విభాగంలో పలు సేవలను అందించాలనే గూగుల్‌ ప్రణాళిక ఆదిలోనే నిలిచిపోయింది. గతంలో గూగుల్‌పే యూజర్లకు ప్లెక్స్‌ సర్వీసులను అందించాలని భావించింది. ఇందుకుగాను ప్లెక్స్‌ సర్వీస్‌ హెల్ప్‌తో డిజిటల్‌ బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించాలని , వాటి ద్వారా సర్వీస్‌ అందించాలని భావించింది. ఫ్లెక్స్‌ సర్వీసెస్‌ సహాయంతో గూగుల్ పే యాప్ ద్వారా డిజిటల్‌ బ్యాంక్‌ ఖాతాలను అందించే ప్రయత్నాలపై గూగుల్‌ వెనక్కి తగ్గింది. గూగుల్‌ పే ద్వారా యూజర్ నిర్వహించే వివిధ రకాల సంప్రదాయ బ్యాంకులు అందించే చెకింగ్ లేదా సేవింగ్స్ ఖాతాల కోసం సైన్ అప్ చేయడానికి ఫ్లెక్స్‌ సర్వీసెస్‌ ద్వారా కస్టమర్లకు అందించాలని గూగుల్‌ భావించింది.

కాగా, గూగుల్‌ ప్లెక్స్‌ సర్వీసులతో యూజర్లు బ్యాంకు సేవలనుంచి దృష్టిమరల్చే అవకాశం ఉంది. గూగుల్‌ తీసుకువస్తోన్న ఈ ప్లెక్స్‌ సర్వీసులు పలు బ్యాంకులతో ప్రత్యక్షపోటీలో ఉండే అవకాశం ఉంటుందని బ్యాంకింగ్‌ నిపుణులు భావిస్తున్నారు. యూజర్లకు నెలవారీ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ ఫీజులు లేకుండా, కనీస నిల్వలు లేకుండా ఖాతాలను అందించే అనేక రకాల ఆర్థిక సంస్థలతో భాగస్వామిగా ఉండటానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది పలు బ్యాంకులకు నష్టాలను కలిగించే విధంగా ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం…ఫ్లెక్స్‌ ప్రాజెక్ట్‌ తరుచూ వాయిదాలు పడుతుండటంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ కంపెనీ నుంచి వెళ్లి పోవడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిన్నట్లు సమాచారం. ఈ సేవలకోసం ఇప్పటికే 4 లక్షల మంది రిజిస్టర్‌ ఐనట్లు వాల్‌స్ట్రీట్‌ స్పష్టం చేసింది.

మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: హైవేపై ఫుట్‌ ఓవర్‌బ్రిడ్జి కింద ఎయిర్ ఇండియా విమానం.. సోషల్ మీడియాలో వీడియో హల్ చల్..

 SBI Festival Offer: కారు కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఎస్బీఐ అందిస్తున్న వడ్డీ రాయితీ..(వీడియో)

 PM Kisan FPO Yojana: రైతుల కోసం మరో అదిరిపోయే స్కీమ్‌.. చేరితే రూ. 15లక్షలు.!(వీడియో)

 Rajiv Assassination Witness Philip: రాజీవ్‌ హత్యకేసు ప్రత్యక్షసాక్షి ఫిలిప్‌.. నాటి అనుభవం పుస్తకంగా తెస్తా..!(వీడియో)

Follow us