Viral Video: హైవేపై ఫుట్ ఓవర్‌బ్రిడ్జి కింద ఎయిర్ ఇండియా విమానం.. సోషల్ మీడియాలో వీడియో హల్ చల్..
విమానం బ్రిడ్జి కిందనుండి వెళ్లటం ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా..? లేదు కదా..కానీ, ఇడితో...ఇక్కడ చూడండి..ఓ విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది..ఢిల్లీ-గురుగ్రామ్ హైవేపై ఫుట్ ఓవర్‌బ్రిడ్జి కింద ఎయిర్ ఇండియా విమానం ఇరుక్కుపోయి కనిపించింది.
విమానం బ్రిడ్జి కిందనుండి వెళ్లటం ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా..? లేదు కదా..కానీ, ఇడితో…ఇక్కడ చూడండి..ఓ విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది..ఢిల్లీ-గురుగ్రామ్ హైవేపై ఫుట్ ఓవర్‌బ్రిడ్జి కింద ఎయిర్ ఇండియా విమానం ఇరుక్కుపోయి కనిపించింది. ఇప్పుడు ఈ విమానం చిత్రాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అదేంటి విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోవడమేంటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ విమానం ఇక్కడికి ఎలా చేరిందని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
అయితే ఈ వీడియో చూసిన ఎయిర్‌లైన్స్ అధికారులు స్పందించారు. అసలు వివరాలను వెల్లడించారు. విమాన ప్రమాదం ఏమి జరగలేదని ప్రకటించారు. అయితే ఇది ఒక పాత, ఆగిపోయిన విమానం అని దీనిని ఎయిర్ ఇండియా విక్రయించిందని తెలిపారు. విమానం యజమాని దీనిని రోడ్డు మార్గం ద్వారా తీసుకెళుతున్నప్పుడు ఇలా అనుకోకుండా బ్రిడ్జి కింద ఇరుక్కుపోయినట్లు తెలిపారు. విమానం చుట్టూ వాహనాలు వెళుతుండటం మనం వీడియోలో చూడవచ్చు. అదే సమయంలో హైవేపై చాలా రద్దీ కూడా కనిపిస్తోంది.
మరోవైపు విమానం ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విమానం ముందు భాగం ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్ కింద దాటింది కానీ వెనుక భాగం ఇరుక్కుపోయింది. ఈ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వీడియో చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : SBI Festival Offer: కారు కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఎస్బీఐ అందిస్తున్న వడ్డీ రాయితీ..(వీడియో)
PM Kisan FPO Yojana: రైతుల కోసం మరో అదిరిపోయే స్కీమ్.. చేరితే రూ. 15లక్షలు.!(వీడియో)
smart watch saves a person: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ప్రాణం పోసిన స్మార్ట్ వాచ్..!(వీడియో)
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

