Hyderabad: పీఎఫ్‌ పేరుతో మోసం.. రూ.9లక్షలు కాజేసిన కేటుగాళ్లు

ప్రభుత్వ రిటైర్డ్ మహిళా ఉద్యోగిని పీఎఫ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ట్రాప్ చేసి మోసగించారు. ప్రావిడెంట్ ఫండ్‌(పీఎఫ్‌) ఆఫీసు నుంచి ఫోన్‌ చేస్తున్నట్లుగా నమ్మించిన కేటుగాళ్లు.. వ్యక్తిగత వివరాలు సేకరించి డబ్బులు కాజేశారు.

Hyderabad: పీఎఫ్‌ పేరుతో మోసం.. రూ.9లక్షలు కాజేసిన కేటుగాళ్లు
Cyber Crime
Follow us
Venkata Chari

|

Updated on: Aug 08, 2021 | 4:04 AM

Cyber Crime: ప్రభుత్వ రిటైర్డ్ మహిళా ఉద్యోగిని పీఎఫ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ట్రాప్ చేసి మోసగించారు. ప్రావిడెంట్ ఫండ్‌(పీఎఫ్‌) ఆఫీసు నుంచి ఫోన్‌ చేస్తున్నట్లుగా నమ్మించిన కేటుగాళ్లు.. వ్యక్తిగత వివరాలు సేకరించి డబ్బులు కాజేవారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన హైదరాబాద్‌లోనే జరిగింది. ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా. సైబర్ ఆగడాలకు మాత్రం అడ్డుకట్టవేయలేకపోతున్నారు. రోజుకో రకంగా ప్రజలను మోసగిస్తూ డబ్బులు కాజేస్తున్నారు. గాంధీనగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ రిటైర్డ మహిళా ఉద్యోగిని పీఎప్ పేరుతో సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేశారు. పీఎఫ్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా నమ్మించారు. ఆమె పూర్తిగా నమ్మడంతో ఆ సైబర్ కేటుగాళ్ల పని సులవైంది.

మీకు రావాల్సిన పీఎఫ్‌ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ నమ్మించారు. డబ్బు జమచేయాలంటే ట్యాక్స్‌ ముందుగానే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలంటూ నమ్మబలికారు. దానికోసం వ్యక్తిగత బ్యాంక్‌ డెబిట్‌ కార్డు, సీవీవీ నంబర్లు తీసుకున్నారు. టాక్స్ కడుతున్నామంటూ చెప్పి ఫోన్‌కి వచ్చిన ఓటీపీ నెంబర్లు కూడా సేకరించారు. ఇలా నాలుగు విడతలుగా మొత్తం రూ.9లక్షలు దండుకున్నారు. ఆ తరువాత వారి నుంచి ఎటువంటి సమాచారం లేదు. సదరు మహిళ వారి నంబర్‌కు ఫోన్ చేయడంతో స్విచాఫ్‌ అని వస్తుండడంత మోసపోయానని గ్రహించింది. దీంతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను అశ్రయించి, ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కర్నూలు జిల్లాలో దారుణం.. స్థలం తక్కువుందని వృద్ధురాలి అంత్యక్రియలు అడ్డుకున్న వైనం..

Sithanagaram Gang Rape Case: సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో మీడియా ముందుకు నిందితులు.. ఈ కర్కోటకుల క్రైమ్స్ తెలిస్తే దడే

Illegal Activities టూరిస్ట్‌ల ముసుగులో వ్యభిచారం.. ఏపీలోని పర్యాటక ప్రదేశాల్లో అసాంఘీక కార్యకలాపాలు.!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..