Sithanagaram Gang Rape Case: సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో మీడియా ముందుకు నిందితులు.. ఈ కర్కోటకుల క్రైమ్స్ తెలిస్తే దడే

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో యువతిపై సామూహిక అత్యాచారం కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. నిందితులను..

Sithanagaram Gang Rape Case: సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో మీడియా ముందుకు నిందితులు.. ఈ కర్కోటకుల క్రైమ్స్ తెలిస్తే దడే
Sithanagaram Gang Rape Case
Follow us

|

Updated on: Aug 07, 2021 | 7:36 PM

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో యువతిపై సామూహిక అత్యాచారం కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా కష్టపడిన పోలీసులు తాజాగా వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. జులై 19  సీతానగరం ఇసుక దిబ్బల వద్దకు సేద తీరడానికి వెళ్లిన ఓ జంటపై దాడిచేసి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కీలక విషయాలు వెల్లడించారు. నిందితుడు కృష్ణ కిషోర్‌ని విజయవాడ రైల్వే ట్రాక్‌పై పట్టుకున్నట్లు తెలిపారు. కృష్ణ కిషోర్ ఈ కేసులో ప్రధాన నిందితుడని.. షేక్ హబీబ్ అనే వ్యక్తి కూడా ఈ నేరంలో పాలుపంచుకున్నట్లు తెలిపారు. అయితే అత్యాచారానికి ముందు నిందితులు ఒకరిని హత్య చేశారని ఎస్పీ వెల్లడించారు. రైల్వే వంతెనపై రాగి తీగలు చోరీ చేస్తుండగా చూశాడని శనక్కాయలు అమ్ముకునే వ్యక్తి హత్య చేసి.. మృతదేహాన్ని కృష్ణా నదిలో పడేశారని పేర్కొన్నారు. విచారణలో కృష్ణ కిశోర్ నేరాలను అంగీకరించాడని.. గతంలో నిందితులకి నేర చరిత్ర ఉందని ఎస్సీ తెలిపారు. చిల్లర దొంగతనాలు, ఇతరులపై దాడులు చేసిన నేరాలు వీరిపై ఉన్నాయని వెల్లడించారు.  కాగా ఈ కేసులో మరో నిందితుడు ఇంకా పరారీలో ఉన్నట్లు ఎస్సీ తెలిపారు.

నిందితుల కోసం మారువేషాల్లో పోలీసుల వేట…

గ్యాంగ్ రేప్ అనంతరం నిందితులు పరారీలో ఉండటంతో వారిని పట్టుకొనేందుకు పోలీసులు స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటుచేశారు. నిందితులిద్దరూ ఫోన్ ఉపయోగించకపోవడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు సమోసాలు విక్రయించే వాళ్లుగా, టిఫిన్ సర్వ్ చేసే వారిగా మారువేషాల్లో గాలింపు చేపట్టారు. నేరస్థులకు గంజాయి తాగే అలవాటు ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. గంజాయి తదితర మత్తు పదార్థాలు విక్రయించే ప్రాంతాల్లో, వాటిని తాగే ప్రదేశాల్లో మారు వేషాల్లో మాటు వేసి గాలించారు. స్థానికంగా ఉండే హిజ్రాల ద్వారా కొంత సమాచారాన్ని సేకరించారు. మొత్తానికి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నారు.

Also Read: ఉదయం థియేటర్లలో రిలీజ్.. మ్యాట్నీకే ‘SR కళ్యాణమండపం’ పైరసీ రెడీ..

జగిత్యాల జిల్లాలో చిక్కిన అరుదైన దెయ్యం చేప.. ఇది వేరే చేపల్ని బ్రతకనియ్యదు..

Latest Articles
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా
ఇక తగ్గేదేలే.. ఫుల్లుగా వర్షాలు.. ఐదురోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఇక తగ్గేదేలే.. ఫుల్లుగా వర్షాలు.. ఐదురోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
థార్ కార్ల ధరలకు రెక్కలు.. బేస్ వేరియంట్లపై రూ.10 వేల పెంపు..
థార్ కార్ల ధరలకు రెక్కలు.. బేస్ వేరియంట్లపై రూ.10 వేల పెంపు..
వేసవిలో సాయంత్రం ఈ స్నాక్స్ తీసుకోండి.. మీ ఆరోగ్యం పదిలం..
వేసవిలో సాయంత్రం ఈ స్నాక్స్ తీసుకోండి.. మీ ఆరోగ్యం పదిలం..
అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??
అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??
టూర్ వెళ్తున్నారా? ఈ క్రెడిట్ కార్డులుంటే బోలెడంత ఆదా..
టూర్ వెళ్తున్నారా? ఈ క్రెడిట్ కార్డులుంటే బోలెడంత ఆదా..
ఆ విధ్వంసకర ప్లేయర్ లేకుండానే బరిలోకి KKR.. SRH షాక్ ఇచ్చేనా?
ఆ విధ్వంసకర ప్లేయర్ లేకుండానే బరిలోకి KKR.. SRH షాక్ ఇచ్చేనా?
పడుకుని ఫోన్ చూస్తున్నారా.. జరిగేది ఇదే! కావాలంటే చెక్ చేసుకోండి
పడుకుని ఫోన్ చూస్తున్నారా.. జరిగేది ఇదే! కావాలంటే చెక్ చేసుకోండి
టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్..
టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్..
కూర్మ జయంతి రోజున విష్ణు పూజ శుభ సమయం, పూజా విధానం మీ కోసం
కూర్మ జయంతి రోజున విష్ణు పూజ శుభ సమయం, పూజా విధానం మీ కోసం