AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gang War: సత్తెనపల్లి నలంద ఇంజినీరింగ్‌ కాలేజ్‌ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్.. క్రికెట్ బ్యాట్లు, కర్రలతో..

గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ స్టూడెంట్లు రెచ్చిపోయారు. సత్తెనపల్లి నలంద ఇంజినీరింగ్‌ కాలేజ్‌ విద్యార్థుల గ్యాంగ్‌వార్‌కు దిగారు....

Gang War: సత్తెనపల్లి నలంద ఇంజినీరింగ్‌ కాలేజ్‌ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్.. క్రికెట్ బ్యాట్లు, కర్రలతో..
Students Gang War
Ram Naramaneni
|

Updated on: Aug 07, 2021 | 6:25 PM

Share

గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ స్టూడెంట్లు రెచ్చిపోయారు. సత్తెనపల్లి నలంద ఇంజినీరింగ్‌ కాలేజ్‌ విద్యార్థులు గ్యాంగ్‌వార్‌కు దిగారు. సీనియర్‌, జూనియర్‌ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. క్రికెట్‌ బ్యాట్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. నలంద ఇంజినీరింగ్‌ కాలేజీ బయట కార్తీక్‌, ప్రియతమ్‌ గ్రూపులుగా విడిపోయి విద్యార్థులు తన్నుకున్నారు. తమను వెంబడించిన కార్తీక్‌ గ్రూప్‌ను.. ప్రియతమ్‌ గ్యాంగ్‌ కారుతో ఢీకొట్టింది. ఈ ఘర్షణలో 8 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

విజయవాడలో మత్తు దందా.. ఏకంగా వాట్సాప్‌లోనే ఆర్డర్లు

విజయవాడలో మత్తు వాసన గుప్పున కొడుతుంది. గంజాయి దందా జోరుగా సాగుతోంది.  కరోనా కారణంగా వ్యాపారాలు దెబ్బతినడంతో.. కొందరు టీ స్టాల్స్‌, ఐస్ క్రీమ్ పార్లర్లు, రెస్టారెంట్ల యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధిక డబ్బు సంపాదించాలని గంజాయి వ్యాపారం చేస్తున్నారు. విశాఖ, నర్సీపట్నం, రంపచోడవరం ఏజెన్సీ ఏరియమాలకు వెళ్లి గంజాయిని తెచ్చి నగరంలో విక్రయాలు చేస్తున్నారు. చిన్న చిన్న పొట్లాలు చేసి ఒక్కోటి 100 నుంచి 500 రూపాయలకు అమ్ముతున్నారు. గంజాయి సేవించే వారి వివరాలను సేకరించి.. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని ఏకంగా ఇంటి వద్దకే తీసుకెళ్లి ఇస్తున్నారు. కొత్త వారిని టార్గెట్ చేసుకుంటున్న మత్తు వ్యాపారులు.. గంజాయి తాగితే ఊహాలోకంలో విహరించొచ్చని.. ఎక్కడా లేని ధైర్యం వస్తుందని వారిని ఆగం చేస్తున్నారు. మొదట కొంత గంజాయిని ఫ్రీగా ఇచ్చి.. మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. ఆ తర్వాత వారి నుంచి భారీగా డబ్బులు గుంజుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలో గంజాయి దందాపై ఐదు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టిన పోలీసులు… యాక్షన్ ప్రారంభించారు.

Also Read: ఎరక్కపోయి వెళ్లాడు.. ఏటీఎంలో ఇరుక్కుపోయాడు.. ఈ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు

నీరజ్‌ చోప్రాకు స్వర్ణం.. భారత్‌ అథ్లెట్స్‌లో వందేళ్ల కల సాకారమైన వేళ..