AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devil Fish: జగిత్యాల జిల్లాలో చిక్కిన అరుదైన దెయ్యం చేప.. ఇది వేరే చేపల్ని బ్రతకనియ్యదు..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలో చేపలు విరివిగా లభిస్తున్నాయి. ఎక్కడ చూసిన జలపుష్పాల సందడి నెలకొంది. తాజాగా..

Devil Fish: జగిత్యాల జిల్లాలో చిక్కిన అరుదైన దెయ్యం చేప.. ఇది వేరే చేపల్ని బ్రతకనియ్యదు..
Devil Fish
Ram Naramaneni
|

Updated on: Aug 07, 2021 | 4:53 PM

Share

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలో చేపలు విరివిగా లభిస్తున్నాయి. ఎక్కడ చూసిన జలపుష్పాల సందడి నెలకొంది. తాజాగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓ అరుదైన చేప వలకు చిక్కింది. చేపలు పట్టడానికి వెళ్లిన జాలరు గొల్లపెళ్లి రాజనర్సు కు అరుదైన వింత చేప తన వలలో పడింది. ఈ విషయాన్ని జిల్లా మత్య్సశాఖ అధికారులకు తెలుపగా, దీనిని డెవిల్ ఫిష్ అంటారని, ఇది ఎక్కువగా సముద్ర జలాల్లో మాత్రమే కనిపిస్తుంటాయని చెప్పారు. మన తెలంగాణలోని వాగులో ఇవి దొరకడం చాలా అరుదు అని చెప్పారు. కాగా ఈ రకపు డెవిల్ ఫిష్ పై నల్లటి మచ్చలు, ముళ్లు ఉన్నాయి. చోప సుమారు అరకేజీకి పైగానే బరువు ఉంది. తాను ఎన్నో ఏండ్ల నుంచి చేపలు పడుతున్న కానీ ఇలాంటి చేప ఎప్పుడు చూడలేదని రాజనర్సు చెబుతున్నాడు. ఒంటినిండా జీబ్రాకు ఉండే  గీతలతో కనిపించే ఈ చేపలో తినేందుకు మాంసం ఉండదు. పైగా చేప నిండా ముళ్లు, చర్మం కప్పబడినట్టు ఉంటుంది. సముద్రజాతికి చెందిన ఈ చేపకు నోరు అడుగు భాగంలో ఉంటుంది. చర్మం అంతా దుప్పటి కప్పబడినట్టు కన్పిస్తుంది. ఈ చేప ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని.. తన చుట్టూ ఉన్న చేపలను ఇది ఆహారంగా తీసుకుంటుందన్నారు. డెవిల్‌ ఫిష్‌కు పదునైన దంతాలు ఉండటం వల్ల వలలను సైతం కొరికి వేస్తుందని మత్య్సశాఖ అధికారులు చెబుతున్నారు.

Also Read: ఎరక్కపోయి వెళ్లాడు.. ఏటీఎంలో ఇరుక్కుపోయాడు.. ఈ సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. మారణాయుధాల కోసం అక్కడ గాలింపు