CM KCR: తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన 'దళితబంధు' పథకం మీద తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దళితులకు పదిలక్షల రూపాయల ఆర్థిక సాయం

CM KCR: తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
Kcr 4
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 07, 2021 | 1:35 PM

CM KCR – Dalita Bandhu Scheme: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ‘దళితబంధు’ పథకం మీద తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దళితులకు పదిలక్షల రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు తీసుకొచ్చిన ఈ పథకం మీద దళితులు తమ సంతోషాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దళిత సోదరులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఇవాళ పాలాభిషేకం చేశారు.

Cm Kcr 1

మిర్యాలగూడ సెంటర్లో ఉన్న భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే భాస్కర్ రావు.

ఈ సందర్భంగా ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘దళితబంధు’ పథకం అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు దళిత సోదరులు, నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అటు, హుజురాబాద్ సహా తెలంగాణ లోని అనేక జిల్లాల్లో దళిత సోదరులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తుండటం విశేషం.

Read also: Snake in Airport: విమానంలోకి ఎక్కబోయిన పాము.. బెదిరిపోయిన ప్రయాణీకులు.. వైరల్‌గా మారిన వీడియో!