AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నూలు జిల్లాలో దారుణం.. స్థలం తక్కువుందని వృద్ధురాలి అంత్యక్రియలు అడ్డుకున్న వైనం..

Crime News : భూమిపై కొంతమంది మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తారు. బతికున్నప్పుడు సాటి మనిషికి ఎలాగో మర్యాద ఇవ్వరు కానీ చనిపోయినప్పుడు కూడా గౌరవం ఇవ్వడం లేదు. పూర్తిగా మానవత్వాన్ని

కర్నూలు జిల్లాలో దారుణం.. స్థలం తక్కువుందని వృద్ధురాలి అంత్యక్రియలు అడ్డుకున్న వైనం..
Funeral
uppula Raju
|

Updated on: Aug 07, 2021 | 9:21 PM

Share

Crime News : భూమిపై కొంతమంది మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తారు. బతికున్నప్పుడు సాటి మనిషికి ఎలాగో మర్యాద ఇవ్వరు కానీ చనిపోయినప్పుడు కూడా గౌరవం ఇవ్వడం లేదు. పూర్తిగా మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అనారోగ్యంతో ఓ వృద్ధురాలు మృతిచెందితే అంత్యక్రియలు చేయడానికి స్థలం లేదని అడ్డుకున్నారు. కొవిడ్ సమయంలో మరణించిన మృతదేహాలకు ఎన్నో స్వచ్చంద సంస్థలు ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించాయి.

కుటుంబ సభ్యులు తీసుకుపోకుండా ఆస్పత్రిలో చాలా రోజుల నుంచి ఉంటున్న శవాలకు కూడా అంత్యక్రియలు నిర్వహించారు. రోడ్లపై అనాథలు, అభాగ్యులు మృతిచెందితే మునిసిపాలిటీవారు దహన సంస్కారాలు చేస్తారు. కానీ ఈ గ్రామస్థులలో కొంతమంది కనికరం లేకుండా వ్యవహరించారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చినా ఖాసీం బి(69) వృద్ధురాలు అనారోగ్యంతో మరణించింది. అయితే గ్రామంలో ముస్లింలకు శ్మశానవాటిక లేకపోవడంతో ఎవరు మరణించినా హిందు శ్మశాన వాటికలో పూడ్చేవారు. అయితే వేరే ఊరికి చెందిన ముస్లిం వృద్ధురాలు చనిపోవడంతో ఇక్కడ పూడ్చడాన్ని గ్రామంలోని కొంత మంది వ్యతిరేకించి అడ్డుకున్నారు. దీంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామ పెద్దలతో మాట్లాడి గ్రామంలోనే అంతక్రియలు జరిగేవిధంగా చూశారు.

‘పూర్’ అంటూ రోజుకు వందల సార్లు ‘పాట’ పాడిన కాంగ్రెస్.. ఇదే ఆ పార్టీ హిపోక్రసీ .. ప్రధాని మోదీ ఆరోపణ

Neeraj Chopra: ఒకప్పుడు ఊబకాయుడు.. ఇప్పుడు వండర్ క్రియేట్ చేసిన వీరుడు.. జయహో నీరజ్

SR Kalyana Mandapam: భారీ వసూళ్లను రాబడుతోన్న ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’.. మొదటి రోజు ఎంతంటే..

PM-Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల కానున్నాయి.. ఎప్పుడంటే..