SR Kalyana Mandapam: భారీ వసూళ్లను రాబడుతోన్న ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’.. మొదటి రోజు ఎంతంటే..

షార్ట్ ఫిలిమ్స్ నంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ వైపు అడుగు వేసిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ యంగ్ హీరో నటించిన ఎస్ ఆర్ కల్యాణమండపం..

SR Kalyana Mandapam: భారీ వసూళ్లను రాబడుతోన్న 'ఎస్ ఆర్ కల్యాణమండపం'.. మొదటి రోజు ఎంతంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 07, 2021 | 8:19 PM

SR Kalyana Mandapam: షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ వైపు అడుగు వేసిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ యంగ్ హీరో నటించిన ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోద్ – రాజ్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ దర్శకత్వం వహించాడు. సీనియర్ నటుడు సాయికుమార్ – తులసి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా టాక్సీవాలా ఫెమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆగస్టు 6న (శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఇటీవలే రీఓపెన్ అయిన విషయం తెలిసిందే. థియేటర్స్ తెరుచుకున్న తర్వాత శుక్రవారం ఎక్కువ సినిమాలు విడుదలయ్యాయి. 5 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా మంచి టాక్ తో పాటు చెప్పుకోదగ్గ వసూళ్లను కూడా రాబడుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 1.6 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా తెలుస్తోంది. 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎస్ ఆర్ కల్యాణమండపం వసూళ్లు పుంజుకునే అవకాశలు కనిపిస్తున్నాయి. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో  రాబోయే సినిమాలకు ఎస్ ఆర్ కల్యాణమండపం ధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా మంచి వసూళ్లు రాబడుతుండటం తో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఉదయం థియేటర్లలో రిలీజ్..మ్యాట్నీకి పైరసీ రెడీ.. కరోనాతో వణుకుతున్న టాలీవుడ్‌పై డూప్లికేటుగాళ్ల దాడి

Varudu Kaavalenu : ‘వరుడు కావలెను’ షూటింగ్‌‌‌‌కు గుమ్మడికాయ కొట్టిన నాగ శౌర్య..

Ananta Sriram: గేయ రచయిత అనంత శ్రీరామ్ పై పోలీసులకు ఫిర్యాదు.. కారణం ఇదే..