Rahul Ramakrishna: అమ్మాయితో కలిసి వైన్ తాగుతూ… హల్‌చల్ చేసిన టాలీవుడ్ కమెడియన్..
సైనిమా" షార్ట్ ఫిల్మ్‌తో అందర్నీ ఆకట్టుకుని నేరుగా అర్జున్ రెడ్డి సినిమాలో అవకాశం కొట్టేసి ఓవర్ నైట్ క్రేజీ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు

Rahul Ramakrishna: “సైనిమా” షార్ట్ ఫిల్మ్‌తో అందర్నీ ఆకట్టుకుని నేరుగా అర్జున్ రెడ్డి సినిమాలో అవకాశం కొట్టేసి ఓవర్ నైట్ క్రేజీ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు రాహుల్ రమాకృష్ణ. యాక్టింగ్లో తన ఈజ్‌తో.. సూపర్ పంచులతో ఫ్యూచర్ స్టార్ కమెడియన్ అనే హోప్‌ను ఇండస్ట్రీకి ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్నారు రాహుల్. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ ఈ క్రేజీ కమెడియన్ యమ యాక్టివ్ గా ఉంటారు. ఇక రీసెంట్గా “జాతిరత్నాలు” సినిమాతో హిట్ కొట్టి ఫుల్‌ఫామ్‌లో ఉన్న ఈ రాహుల్ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో రాబోతున్నారు. విశ్వక్ సేన్ నటిస్తున్న పాగల్ మూవీలో నటిస్తున్నారు రాహుల్ ఈ సినిమాలో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇన్‌స్టా వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నారు.
ఓ అమ్మాయితో కలిసి వైన్ తాగుతూ… జాజ్ ట్యూటోరియల్స్‌లో పాల్గొన్నారు. “వి కాంట్ వైండ్ అప్ విత్ అవుట్ వైన్” అంటూ స్టేట్ మెంట్ ఇచ్చి మరీ.. ఆ అమ్మాయితో కలిసి పాడడానికి ట్రై చేశాడు..మన జాతిరత్నం. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి..
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :




