PM-Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల కానున్నాయి.. ఎప్పుడంటే..

దేశంలోని రైతన్నలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద 9వ విడత నిధులు త్వరలో విడుదల చేయనున్నారు.

PM-Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల కానున్నాయి.. ఎప్పుడంటే..
Pm Kisan
Follow us
KVD Varma

|

Updated on: Aug 07, 2021 | 8:17 PM

PM-Kisan: దేశంలోని రైతన్నలకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద 9వ విడత నిధులు త్వరలో విడుదల చేయనున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి వెలువడిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. దీని ప్రకారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా తదుపరి విడత ఆర్ధిక ప్రయోనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఆగస్ట్ 9న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా 9.75 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. వీరికి 19,500 కోట్లు ఈ కార్యక్రమం కింద విడుదల కానున్నాయి. ఇక రైతులకు సొమ్ములు విడుదల చేసే కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ రైతు లబ్ధిదరుఅల్థో సంభాశిస్తారు. అదేవిధంగా ఆయన దేశాప్రజాలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అంటే..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద, సంవత్సరానికి 6000/- రూపాయల ఆర్థిక ప్రయోజనం అర్హత కలిగిన లబ్ధిదారు రైతు కుటుంబాలకు అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు సమానమైన వాయిదాలలో అంటే నాలుగు నెలలకు ఓసారి 2000 రూపాయల చొప్పున రైతులకు అందిస్తారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకంలో, ఇప్పటివరకూ 1.38 లక్షల కోట్లు రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగింది.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వచ్చిందీ లేనిదీ ఎలా తనిఖీ చేయాలి?

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారు తనకు సొమ్ములు బ్యాంకులో వచ్చినవీ లేనిదీ ఇలా తెలుసుకోవచ్చు.

దశ 1: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లండి.

దశ 2: హోమ్ పేజీలో ఉన్న ‘లబ్ధిదారుని స్థితి’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

దశ 3: ఇప్పుడు తెరుచుకునే విండోలో, ఏదైనా ఎంపికను ఎంచుకోండి – ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్.

దశ 4: ఎంచుకున్న ఎంపికను ఎంచుకున్న తర్వాత, ‘డేటాను పొందండి’ పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా

అక్కడే కనిపించే ‘పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్’ డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి

Also Read: Aircraft Carrier Vikrant: భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ‘విక్రాంత్’ రెడీ.. దీని ప్రత్యేకతలు ఇవే!

Assam-Mizoram: అస్సాం-మిజోరాం మధ్య మళ్ళీ బార్డర్ రగడ.. నాలుగు లారీలు ధ్వంసం