‘పూర్’ అంటూ రోజుకు వందల సార్లు ‘పాట’ పాడిన కాంగ్రెస్.. ఇదే ఆ పార్టీ హిపోక్రసీ .. ప్రధాని మోదీ ఆరోపణ

పేదల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిన సానుభూతి అంతా కపటనాటకమని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ హిపోక్రసీ ఇలా బయట పడుతూనే వచ్చిందన్నారు.

'పూర్' అంటూ రోజుకు వందల సార్లు 'పాట' పాడిన కాంగ్రెస్.. ఇదే  ఆ  పార్టీ  హిపోక్రసీ .. ప్రధాని మోదీ ఆరోపణ
Modi
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 07, 2021 | 8:33 PM

పేదల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిన సానుభూతి అంతా కపటనాటకమని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ హిపోక్రసీ ఇలా బయట పడుతూనే వచ్చిందన్నారు. రోజంతా ‘పూర్’ అని వందలసార్లు ‘పాట’ లా పాడుతూ చివరకు ఆ పార్టీ వారికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ప్రయోజనం పొందిన మధ్యప్రదేశ్ లోని లబ్దిదారులను ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇదివరకటి (కాంగ్రెస్) ప్రభుత్వ హయాంలో సిస్టం అంతా భ్రష్టు పట్టిందని, పేదల గురించి ఆ ప్రభుత్వం ప్రశ్నలు వేస్తూ సమాధానాలు కూడా తనకు తానే చెప్పుకునేదని అన్నారు. రోడ్లు, విద్యుత్, హోసింగ్ తదితర సౌకర్యాల నుంచి వారిని దూరంగా ఉంచేదని, పూర్ పూర్ అంటూ పాటలా సాగదీసేదని అన్నారు. ఇది హిపోక్రసీ కాక మరేమిటన్నారు. చెప్పేదొకటి చేసేదొకటి అంటే ఇది కాదా అని వ్యాఖ్యానించారు.

అయితే ఇప్పుడు మార్పు వచ్చిందని (బీజేపీ ప్రభుత్వ హయాంలో) లబ్దిదారులకు అన్ని పథకాల ఫలాలు అందుతున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ మార్పు కారణంగా శీఘ్రగతిన పథకాల అమలు జరుగుతోందన్నారు. ప్రజలు ఈ మార్పును గమనిస్తున్నారని ఆయన చెప్పారు. దేశంలో కోవిడ్ పరిస్థితిని గురించి ప్రస్తానావిస్తూ.. మన వ్యాక్సిన్ ని మనమే తయారు చేసుకోగలుగుతున్నామని తెలిపారు. ఇతర దేశాలు ఇండియాను చూసి ప్రశంసిస్తున్నాయని వెల్లడించారు. నిన్నటికి దేశంలో 50 కోట్ల డోసుల వ్యాక్సిన్ ని ఇవ్వడం పూర్తి అయిందని ఆయన పేర్కొన్నారు. ఇది అత్యంత ముదావహమన్నారు. సంక్షేమ పథకాల అమలులో మధ్యప్రదేశ్ ప్రభుత్వ కృషిని ఆయన ప్రశంసించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: SR Kalyana Mandapam: భారీ వసూళ్లను రాబడుతోన్న ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’.. మొదటి రోజు ఎంతంటే..

PM-Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల కానున్నాయి.. ఎప్పుడంటే..

Latest Articles
చల్ల చల్లని కూల్ న్యూస్.. లేటేస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
చల్ల చల్లని కూల్ న్యూస్.. లేటేస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
గ్యాస్‌ లైటర్‌ మోరాయిస్తుందా..? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ట్రై చేయండి!
గ్యాస్‌ లైటర్‌ మోరాయిస్తుందా..? ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ట్రై చేయండి!
త్రినయని సీరియల్ నటి మృతి..
త్రినయని సీరియల్ నటి మృతి..
అమ్మకు ప్రేమతో.. ఈ యువకుడి టాలెంట్ చూస్తే ఔరా అనాల్సిందే..
అమ్మకు ప్రేమతో.. ఈ యువకుడి టాలెంట్ చూస్తే ఔరా అనాల్సిందే..
ఈ పాముకు ఆస్కార్ కూడా తక్కువే.. చచ్చిపోయినట్లు నటించి కాటేస్తుంది
ఈ పాముకు ఆస్కార్ కూడా తక్కువే.. చచ్చిపోయినట్లు నటించి కాటేస్తుంది
ఇదేందయ్యా ఇది.. మిస్టరీ యార్కర్‌తో మాటల్లేకుండా చేశావ్..
ఇదేందయ్యా ఇది.. మిస్టరీ యార్కర్‌తో మాటల్లేకుండా చేశావ్..
పోషకాల గని ఖర్జూరం.. నెయ్యిలో నానబెట్టి ఖాళీ కడుపుతో తింటే లాభాలు
పోషకాల గని ఖర్జూరం.. నెయ్యిలో నానబెట్టి ఖాళీ కడుపుతో తింటే లాభాలు
ఆ మహిళకు తలనొప్పిగా మారిన సిరా గుర్తు! 9 ఏళ్లయినా చెరగిపోని ఇంక్
ఆ మహిళకు తలనొప్పిగా మారిన సిరా గుర్తు! 9 ఏళ్లయినా చెరగిపోని ఇంక్
క్షణంలో కబళించిన మృత్యువు.. ఫ్లైఓవర్ మలుపుపై షాకింగ్ విజువల్స్..
క్షణంలో కబళించిన మృత్యువు.. ఫ్లైఓవర్ మలుపుపై షాకింగ్ విజువల్స్..
అక్కినేని కజిన్స్ మొత్తం ఒక్కచోటే.. ఎంతమంది ఉన్నారో తెలుసా.. ?
అక్కినేని కజిన్స్ మొత్తం ఒక్కచోటే.. ఎంతమంది ఉన్నారో తెలుసా.. ?