Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం.. మరో ముగ్గురికి
Rajasthan Accident: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి లారీ- కారు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా
Rajasthan Accident: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి లారీ- కారు ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలోని కూచమాన్ పట్టణం సమీపంలోని నాగౌర్‌లో చోటుచేసుకుంది. చురు రాజల్‌దేసర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం కారులో శనివారం రాత్రి ఇంటికి వెళుతుండగా.. ఎదురుగా వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు కూచ్‌మన్ పోలీసు అధికారి వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జైపూర్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయని.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా.. నాగౌర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీనిచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: