AP Crime: ఆ అనుమానంతో.. భార్యపై కత్తితో దాడి.. అనంతపురం జిల్లాలో దారుణం..

Husband attacked Wife: ఆంధ్రప్రదేశ్‌లోనూ అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానాన్ని పెంచుకున్న ఓ భర్త కత్తితో దారుణంగా

AP Crime: ఆ అనుమానంతో.. భార్యపై కత్తితో దాడి.. అనంతపురం జిల్లాలో దారుణం..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 08, 2021 | 10:40 AM

Husband attacked Wife: ఆంధ్రప్రదేశ్‌లోనూ అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానాన్ని పెంచుకున్న ఓ భర్త కత్తితో దారుణంగా దాడి చేశాడు. పెళ్లి అయిన కొన్నేళ్ల తరువాత పర పురుషులతో మాట్లాడనంటూ తనకు హామీ పత్రం రాసివ్వాలని కట్టుకున్న భార్యపై ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన జిల్లాలోని గుంతకల్లు పట్టణం ఆంథోని కాలనీలో శనివారం చోటుచేసుకుంది. అనంతరం బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లుకు చెందిన రజాక్‌కు అనంతపురానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే.. ఈ దంపతులిద్దరూ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య ఇతర పురుషులతో మాట్లాడుతోందని భర్త రజాక్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఆమెను కొట్టడంతో పుట్టింటికి వెళ్లిపోయింది.

అనంతరం ఇటీవల మూడు రోజుల కింద భార్య తిరిగి ఇంటికి రాగా గొడవ పెట్టుకున్నాడు. ఇక నుంచి ఇతర పురుషులతో మాట్లాడనంటూ తనకు రాతపూర్వకంగా రాసి ఇస్తేనే ఇంట్లో ఉండాలని.. అలా తనకు హామీ ఇవ్వాలని రజాక్ షర్మిలపై ఒత్తిడి చేశాడు. అయితే.. భర్త షరతులకు ఆమె అంగీకరించక పోవడంతో ఇంట్లో ఉన్న కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు వెల్లడించారు.

Also Read:

Dog Shopping: ఇది మామూలు శునకం కాదోచ్.. ఆర్డరిస్తే చాలు.. వెంటనే తెచ్చేస్తుంది..

మంటల్లో గ్రీస్ దేశం.. నిరాశ్రయులైన వేలాది కుటుంబాలు.. సాయానికి పలు దేశాలు సిద్ధం