AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Shopping: ఇది మామూలు శునకం కాదోచ్.. ఆర్డరిస్తే చాలు.. వెంటనే తెచ్చేస్తుంది..

Dog Shopping: మనతో అత్యంత చనువు జీవించే జంతువుల్లో కుక్క ఒకటి. చేరదీస్తే.. చాలు విశ్వాసానికి మారు పేరుగా నిలుస్తూ మనతో మమేకమైపోతుంది. అందుకే చాలా ఇళ్లల్లో

Dog Shopping: ఇది మామూలు శునకం కాదోచ్.. ఆర్డరిస్తే చాలు.. వెంటనే తెచ్చేస్తుంది..
Dog Shopping
Shaik Madar Saheb
|

Updated on: Aug 08, 2021 | 10:14 AM

Share

Dog Shopping: మనతో అత్యంత చనువు జీవించే జంతువుల్లో కుక్క ఒకటి. చేరదీస్తే.. చాలు విశ్వాసానికి మారు పేరుగా నిలుస్తూ మనతో మమేకమైపోతుంది. అందుకే చాలా ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటారు. శునకాలు విశ్వాసం చూపడంలోనే కాదు యజమానులను ప్రమాదాల బారి నుంచి కాపాడటంలో, రక్షణగా నిలువడంలో ఎల్లప్పుడూ ముందుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. కొంచెం ట్రైనింగ్ ఇస్తే చాలు కుక్కలు ఎలాంటి పనులైనా చేయగలవు.. అన్న దానికి నిదర్శనంగా నిలిచింది తమిళనాడుకి చెందిన జాక్ స్పారో అనే శునకం.. ఈ కుక్క స్వయంగా తనే వెళ్లి షాపింగ్‌ చేస్తుంది. తన యజమాని రాసిచ్చిన చిట్టిని తీసుకెళ్లి.. ఆ వస్తువులన్నింటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తుంది. అంతేకాదు మిగిలిన చిల్లరను జాగ్రత్తగా తెచ్చి అప్పజెబుతుంటుంది. ఈ జాక్ స్పారో.. తమిళనాడులోని దిండిగుల్‌ జిల్లా పళనిలోని దాస్‌ ఫెర్నాండెజ్‌‌కి చెందిన పెంపుడు కుక్క.

అయితే.. దాస్‌ ఫెర్నాండెజ్‌‌ ఈ లాబ్రడార్ జాతి కుక్కకు.. చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చారు. దుకాణానికి వెళ్లి వస్తువులు తీసుకురావడం, అదే విధంగా చిన్న చిన్న పనులు చేయడం లాంటివి అలవాటు చేశారు. ఫెర్నాండెజ్ చీటీ రాసి ఇవ్వగానే.. కుక్క నేరుగా దుకాణానికి వెళ్లి, అక్కడ వారిచ్చే వస్తువులను తీసుకుని ఇంటికి వస్తుంది. కాగా.. జాక్‌ స్పారో షాపింగ్‌ను స్థానికులతోపాటు.. బయటి ప్రాంతాల వారు ఆసక్తిగా తిలకిస్తుంటారు. నిజంగా జాక్ స్పారో గ్రేట్ అంటూ కితాబిస్తున్నారు. కాగా.. జాక్ స్పారో మెడలో సంచితో షాపింగ్‌కు వెళ్లి వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇది చూసిన వారంతా ఇలాంటి కుక్క తమకు కూడా ఉంటే.. చాలంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

India Corona: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Viral Video: ఫాంటా కూల్ డ్రింక్ పోసి ఆమ్లెట్ వేసాడు.. వీడి క్రియేటివిటీ తగలెయ్యా.. ఇదేమి వెరైటీ ఫుడ్ రా సామి..