అనుమానంతో భార్య హత్య.. అనాధలుగా మిగిలిన చిన్నారులు

అనుమానం పెనుభూతమంటారు.. అదే అనుమానంతో ఎన్నో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. ఐదేళ్ల కాపురం చేసిన భార్య,భర్తల మధ్య అనుమానం వారిమధ్య దూరాన్ని పెంచింది. దీని ఫలితం ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు పరారీలో ఉన్నారు. కామారెడ్డి జిల్లా నస్రూలాబాద్ మండలానికి చెందిన జ్యోతి, నిర్మల్ జిల్లా కడెం గ్రామానికి చెందిన రాజు ఇద్దరూ భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం పెను ప్రకంపనలు రేపింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న రాజు  […]

అనుమానంతో భార్య హత్య.. అనాధలుగా మిగిలిన చిన్నారులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Aug 05, 2019 | 5:52 PM

అనుమానం పెనుభూతమంటారు.. అదే అనుమానంతో ఎన్నో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. ఐదేళ్ల కాపురం చేసిన భార్య,భర్తల మధ్య అనుమానం వారిమధ్య దూరాన్ని పెంచింది. దీని ఫలితం ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు పరారీలో ఉన్నారు.

కామారెడ్డి జిల్లా నస్రూలాబాద్ మండలానికి చెందిన జ్యోతి, నిర్మల్ జిల్లా కడెం గ్రామానికి చెందిన రాజు ఇద్దరూ భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం పెను ప్రకంపనలు రేపింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న రాజు  ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ఒకటిరెండుసార్లు పెద్దల్లో కూర్చుని పంచాయతీలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో జూలై29న ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆమెను తీవ్రంగా కొట్టడంతో పాటు గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగువారు జ్యోతిని హస్పిటల్‌కు తరలించారు. చివరికి ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ ఘటనపై మృతురాలు జ్యోతి సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు రాజు పరారీలో ఉండగా తల్లిని పోగొట్టుకుని, తండ్రి కనిపించక చిన్నారులిద్దరూ కన్నీటి పాలవుతున్న దృశ్యం అక్కడున్నవారిని కంటతడి పెట్టిస్తుంది.

తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..