తండ్రి మందలించాడని.. ఆరో అంతస్తు నుంచి కిందకు దూకిన బ్యూటీషియన్..
ముంబైలో ఓ బ్యూటిషియన్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెంబురులోని మహుల్ మహడ కాలనీలో ఉంటున్న ఆరతి తాప్సీ ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తోంది. రోజూలాగే పార్లర్‌కు వెళ్లి ఓ రోజు ఇంటికి ఆలస్యంగా రావడంతో.. తండ్రి ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపానికి గురై ఆమె భవనం ఆరో అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకింది. ఇదంతా సీసీ కెమెరాలో చూసిన ఓ వ్యక్తి వెంటనే కుటుంబ […]
ముంబైలో ఓ బ్యూటిషియన్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెంబురులోని మహుల్ మహడ కాలనీలో ఉంటున్న ఆరతి తాప్సీ ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తోంది. రోజూలాగే పార్లర్‌కు వెళ్లి ఓ రోజు ఇంటికి ఆలస్యంగా రావడంతో.. తండ్రి ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపానికి గురై ఆమె భవనం ఆరో అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకింది. ఇదంతా సీసీ కెమెరాలో చూసిన ఓ వ్యక్తి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కాగా, గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.