మూడేళ్ల చిన్నారితో పాటు కుటుంబాన్ని చంపేసి.. పంజాబ్‌లో దారుణం
పంజాబ్‌లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. సందీప్‌సింగ్ అనే వ్యక్తి పంజాబ్‌లోని నథువాల్ గ్రామంలో తన కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన సొంత తాతయ్య, అమ్మ,నాన్న, సోదరితో పాటు ఆమె మూడేళ్ల చిన్నారిని సైతం తుపాకీతో కాల్చాడు. ఈ కాల్పుల్లో వీరంతా అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పులకు పాల్పడ్డ సందీప్ ఆతర్వాత తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సామూహిక […]
పంజాబ్‌లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. సందీప్‌సింగ్ అనే వ్యక్తి పంజాబ్‌లోని నథువాల్ గ్రామంలో తన కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన సొంత తాతయ్య, అమ్మ,నాన్న, సోదరితో పాటు ఆమె మూడేళ్ల చిన్నారిని సైతం తుపాకీతో కాల్చాడు. ఈ కాల్పుల్లో వీరంతా అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పులకు పాల్పడ్డ సందీప్ ఆతర్వాత తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సామూహిక హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అసలు ఎందుకు ఇలా అందరినీ హతమార్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయంపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.