AP Crime News: ఏపీలో దారుణం.. కౌన్సిలింగ్‌కు పిలిచి బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం..
Nellore Crime: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నేరాలను కట్టడిచేసే బాధ్యతగల పోలీసు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కౌన్సిలింగ్ ఇస్తానని
Nellore Crime: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నేరాలను కట్టడిచేసే బాధ్యతగల పోలీసు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కౌన్సిలింగ్ ఇస్తానని బాలికను ఇంట్లోకి పిలిచిన హెడ్ కానిస్టేబుల్ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. బిట్టమూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సమస్యపై తండ్రి కూతురు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే.. వారు సుధాకర్‌ను సంప్రదించగా.. బాలికకు కౌన్సిలింగ్ ఇస్తానని తండ్రితోపాటు ఆమెను ఇంటికి పిలిపించుకున్నాడు.
ఈ క్రమంలో బాలిక తండ్రిని ఇంటికి సమీపంలోని ఓ షాపుకి పంపించాడు. అనంతరం సుధాకర్ ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఎవరికైనా చెబితే హాని తలపెడతానికి బెదిరించడంతో బాలిక అప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంటికి వెళ్లగానే బాలిక జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. దీంతో బాలిక, ఆమె తండ్రి బిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సుధాకర్‌ను అదుపులోకి తీసుకోని విచారించారు. పోలీసుల విచారణలో బాలికపై అత్యాచారయత్నం జరిగినట్లు తేలడంతో ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బిట్టమూరు పోలీసులు తెలిపారు.
Also Read: