AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2021: పీకల దాకా మద్యం తాగి ప్రాణాలు తీస్తున్న వాహనదారులు.. ఈ ఏడాది ఎంతమందో తెలుసా?

Drunk and Drive Cases 2021: తాగి వాహనాలు నడిపే వారికి శిక్ష పడుతుందా ? పీకల దాకా మద్యం సేవించి అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఎంత మందికి శిక్ష పడింది? లోపం ఎక్కడుంది ?

Year Ender 2021: పీకల దాకా మద్యం తాగి ప్రాణాలు తీస్తున్న వాహనదారులు.. ఈ ఏడాది ఎంతమందో తెలుసా?
Drunken Driving
Balaraju Goud
|

Updated on: Dec 28, 2021 | 10:00 AM

Share

Drunk and Drive Pending Cases 2021: తాగి వాహనాలు నడిపే వారికి శిక్ష పడుతుందా ? పీకల దాకా మద్యం సేవించి అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఎంత మందికి శిక్ష పడింది? లోపం ఎక్కడుంది ? కోర్టు తీర్పులు ఆలస్యమవుతున్నాయా? లేక సెక్షన్లలోనే లోపం ఉందా? మందుబాబులకు శిక్ష పడకుంటే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ప్రమాదాలను ఆపేదెలా ? రహదారులు రక్తపుటేరులు పారాల్సిందేనా? రోజు రోజుకీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో మరింత ఆందోళన కలిస్తోంది.

ఒక్క సైబరాబాద్‌ పరిధిలోనే 32 వేల కేసులకు 26 వేలకు పైగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని తెలంగాణలో దాదాపు 50 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 304 పార్ట్ 2 కింద కేసులు నమోదు చేసినా, ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాగైతే పీకల దాకా మద్యం సేవించి, విచ్చలవిడిగా డ్రైవింగ్‌ చేస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్న మందుబాబుల ఆగడాలకు కళ్లెం పడటంలేదు.

ఈ ఏడాది తాగి వాహనాలు నడిపిన 280 మంది డ్రైవర్లపై 304 పార్ట్‌ 2 కింద కేసులు నమోదు చేశామని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. అయితే, 304 పార్ట్‌ 2 కింద 286 మందిపై కేసులు నమోదు చేసినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా శిక్ష ఖరారు కాలేదంటున్నారు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌. స్పీడీ ట్రయల్స్‌ జరిగితే త్వరగా శిక్ష పడే చాన్స్‌ ఉందంటున్నారు. ఇప్పటికే కోర్టు మానిటరీ సెల్‌ వీటిపై స్పెషల్‌గా విచారణ జరుపుతోందన్నారు. 35 శాతం రోడ్డు ప్రమాదాలు తాగి వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నాయని డీసీపీ తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంజిత్‌ అందిస్తారు.

ఒక్క సైబ‌రాబాద్ పోలీస్‌ కమిషనరేట్‌ ప‌రిధిలోనే ఈ ఏడాది 36 వేల 512 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 27 వేల 600 మంది వాహ‌నదారులు రెండోసారి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డటం ఆందోళన కలిగించే విషయం. దీన్ని బ‌ట్టి డ్రంకెన్ డ్రైవ్ విష‌యంలో వాహ‌న‌దారులకు ఏ మాత్రం భ‌య‌ం లేద‌ని తెలుస్తోంది. ఈ ఏడాది 3989 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 759మంది ప్రాణాలు కోల్పోయారు. డ్రంకెన్ డ్రైవ్ ల్లో 12 వేల కేసులు వీగిపోగా…26 వేల కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.

ఇటు హైద‌ర‌బాద్ పోలీస్‌ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో డ్రంకెన్ డ్రైవ్ యాక్సిడెంట్ల సంఖ్య గ‌త ఏడాదితో పోలిస్తే నాలుగు రేట్లు పెరిగింది. గ‌త ఏడాది 6 వేల 588 కేసులు న‌మోదు అయితే ఈ సారి ఏకంగా 25 వేల 453 కేసులు న‌మోదు అయ్యియి. ఇందులో 10109 కేసుల్లో చార్జీషీట్ దాఖ‌లు చేశారు పోలీసులు. ఇందులో 206 మందికి జైలు శిక్ష ప‌డ‌గా…25మంది డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు చేశారు. 86 మంది పై 304 పార్ట్ 2 కింద కేసులు నమోదు చేసినా ఏ ఒక్కరికి ఇంకా శిక్ష ఖరారు కాలేదు.

రాచ‌కొండ పోలీస్‌ కమిషనరేట్‌ ప‌రిధిలో ఈ ఏడాది 8121 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో 613 మందికి మాత్రమే శిక్ష పడింది. రోడ్డు ప్రమాదాల్లో 618 మంది మ‌ర‌ణించగా, ఇందులో 40 శాతం తాగి న‌డిపిన వారే ఉన్నారు. గాయ‌ప‌డ్డవారు 2492 మంది ఉన్నారు. గ‌త ఏడాది 3923 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు న‌మోదు కాగా ఈ ఏడాది అ సంఖ్య రెట్టింపు అయింది. తాగి వాహ‌నాలు న‌డిపిన 15 మంది డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు చేశారు రాచకొండ పోలీసులు.

Read Also…  ఇది మామూలు కుక్క కాదురోయ్‌.. మహా ముదురు.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో