Credit Card Fraud: తిరిగిచ్చేసిన క్రెడిట్ కార్డులతో జల్సా.. మోసాలకు పాల్పడుతున్న బ్యాంకు ఉద్యోగి అరెస్ట్..
Bank Employee Arrested: మీకు క్రెడిడ్ కార్డు ఉందా..? దాన్ని బ్యాంకుకు రిటర్న్ చేశారా.. అయితే.. మీరు కూడా అలెర్ట్‌గా ఉండాల్సిందే. ఎందుకంటే అలా రిటర్న్ ఇచ్చిన కార్డుల నుంచి
Credit Card Fraud in Srikakulam: మీకు క్రెడిడ్ కార్డు ఉందా..? దాన్ని బ్యాంకుకు రిటర్న్ చేశారా.. అయితే.. మీరు కూడా అలెర్ట్‌గా ఉండాల్సిందే. ఎందుకంటే అలా రిటర్న్ ఇచ్చిన కార్డుల నుంచి ఓ బ్యాంకు ఉద్యోగి పెద్ద మొత్తంలో నగదు కాజేశాడు. ఈ షాకింగ్ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. క్రెడిట్ కార్డు మోసాలకు పాల్పడుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ బ్యాంకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 35వేల నగదుతో పాటు 10 క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జల్సాలకు అలవాటుపడిన రాజేష్ దాదాపు 10 లక్షల వరకు మోసాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘరానా మోసం పాలకొండ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వెలుగు చూసింది.
పాలకొండ ఎస్‌బీఐలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజేష్.. ఖాతాదారులు తిరిగి ఇచ్చేసిన క్రెడిట్ కార్డులతో తన సొంతానికి నగదు వితిడ్రా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒప్పంద ఉద్యోగి అయిన రాజేష్ కుమార్ పాలకొండ, రాజాం, వీరఘట్టాం, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లోని ఖాతాదారులకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంటాడు. అయితే.. ఖాతాదారులు తిరిగి ఇచ్చేసిన క్రెడిట్ కార్డులను తన సొంతానికి వాడుకుంటూ సుమారు ఎనిమిది లక్షల మేర కాజేశాడు. ఖాతాదారులకు బ్యాంకు నుంచి డబ్బులు వాడుకున్నట్లు మెసేజ్ రావడంతో కంగుతిన్న ఖాతాదారులు వెంటనే బ్యాంకును ఆశ్రయించారు. దాదాపు 25 మంది ఖాతాదారులు బ్యాంకు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పాలకొండ పోలీసులు.. రాజేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో ఖాతాదారుల డబ్బులను తన సొంతానికి వాడుకున్నట్లు రాజేష్ కుమార్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజేష్ కుమార్‌పై చీంటిగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పాలకొండ డీఎస్పీ శ్రావణి తెలిపారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు పంపించినట్లు ఆమె వెల్లడించారు.
Also Read: