Guntur Police:15 రోజుల్లో పదిమంది చేతులు మారిన మూడు నెలల శిశువు.. చివరకు ఏం జరిగిందంటే..?
Gang selling newborn babies: ఆర్థిక ఇబ్బందులతో ఆడశిశువునే విక్రయించాడు ఓ ప్రబుద్దుడు. గుంటూరు జిల్లా (guntur district) లోని మంగళగిరి గండాలయ్య పేటలో మనోజ్ కుటుంబంతో నివసిస్తున్నాడు.
Gang selling newborn babies: ఆర్థిక ఇబ్బందులతో ఆడశిశువునే విక్రయించాడు ఓ ప్రబుద్దుడు. గుంటూరు జిల్లా (guntur district) లోని మంగళగిరి గండాలయ్య పేటలో మనోజ్ కుటుంబంతో నివసిస్తున్నాడు. అయితే.. మనోజ్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. మూడోసారి అబ్బాయి పుడతాడనుకున్నాడు మనోజ్. ఈ క్రమంలో మూడు నెలల క్రితం మరోసారి అమ్మాయి పుట్టింది. దీంతో ఆ శిశువును విక్రయించేందుకు మనోజ్ సిద్దమయ్యాడు. ఆర్థిక సమస్యలతో ముగ్గురు ఆడశిశువులను పెంచలేనని చివరి శిశువును అమ్ముతానని (Mangalagiri) పట్టణానికే చెందిన నాగలక్ష్మితో చెప్పాడు. వీరిద్దరూ కలిసి గాయత్రి అనే మహిళ వద్దకు వెళ్ళారు. వీరి వద్ద నుండి ఆడశిశువును గాయత్రి 70 వేల రూపాయలకు కొనుగోలు చేసింది.
గాయత్రి వద్ద నుండి మరొకరు, అక్కడ నుండి మరొకరి చేతులు మారిన శిశువు చివరికి హైదరాబాద్‌కు చెందిన రమేష్ వద్దకు చేరింది. రమేష్ రూ. రెండున్నర లక్షలకు కొనుగోలు చేశాడు. అయితే.. శిశువు ఇలా చేతులు మారుతున్న సమయంలోనే శిశువు అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన గుంటూరు పోలీసులు శిశువులను విక్రయించే ముఠానే కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
దీంతో పోలీసులు తండ్రితో పాటు మరో పది మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఉన్న శిశువును తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. గతంలో ఏమైనా శిశువులను విక్రయించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు గుంటూరు నార్త్ డిఎస్పీ రాంబాబు తెలిపారు.
-టి నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్, గుంటూరు
Also Read: