Nigeria: దారుణం.. బార్‌లో విచక్షణారహితంగా కాల్పులు.. 10 మందిని చంపిన దుండగుడు..
Gunmen kill: నైజీరియా దేశంలో మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఓ బార్‌లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది
Gunmen kill: నైజీరియా దేశంలో మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఓ బార్‌లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యానులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో సెంట్రల్ నైజీరియాలోని జోస్ సౌత్‌లోని బార్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 10 మంది మరణించారని నైజీరియా పోలీసు ప్రతినిధి ఉబాఒగాబా వెల్లడించారు. బార్ లో కాల్పులు జరిపిన గన్‌మెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కాల్పుల సమాచారం అందగానే భద్రతా సిబ్బంది, అప్రమత్తమయ్యారని.. వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారని నైజీరియా పోలీసు అధికారి వెల్లడించారు.
అయితే.. ఇటీవల కాలంలో కాల్పుల సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 20 మంది వరకూ మరణించారు. ప్రస్తుతం బార్‌లో జరిగిన కాల్పుల సంఘటన నైజీరియాలో సంచలనం రేపింది. అయితే.. ఈ కాల్పుల వెనుక ఉగ్రవాద సంస్థలు ఉండే అవకాశముందని పలువురు వెల్లడిస్తున్నారు.
Also Read: