Telangana: హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్ ప్రెస్ లో కాల్పులు.. ఉలిక్కిపడ్డ ప్రయాణీకులు
దురంతో ఎక్స్ ప్రెస్ (Durantho Express) లో కాల్పులు కలకలం రేపాయి. ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో తుపాకీ తూటా శబ్ధాలు విని తోటి ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తున్న...
దురంతో ఎక్స్ ప్రెస్ (Durantho Express) లో కాల్పులు కలకలం రేపాయి. ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో తుపాకీ తూటా శబ్ధాలు విని తోటి ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం నెలకొంది. అది కాస్తా చినికి చినికి గాలి వానలా మారి తుపాకీ కాల్పులకు దారి తీసింది. రైలు మంచిర్యాల సమీపానికి చేరుకోగానే సహనం కోల్పోయిన వ్యక్తి.. స్నేహితుని వద్ద ఉన్న గన్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనను గమనించిన టీసీ.. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారిని కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో దింపి విచారణ చేస్తున్నారు. కాగా వారిద్దరూ ఆర్మీలో పని చేస్తుండటం గమనార్హం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..