Selfie: అక్కడ సెల్ఫీ దిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.. ఫైన్‌తోపాటు జైలు శిక్ష.. ఎక్కడంటే?
Selfies criminal offence: ఇటీవల కాలంలో ఎటు వెళ్లినా.. ఏం చేసినా.. ఏం చూసినా.. సెల్ఫీ మోజులో పడి.. చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక టూరిస్ట్
Selfies criminal offence: ఇటీవల కాలంలో ఎటు వెళ్లినా.. ఏం చేసినా.. ఏం చూసినా.. సెల్ఫీ మోజులో పడి.. చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక టూరిస్ట్ ప్రదేశాలు అయితే.. మరింత హద్దు దాటి మరి సెల్ఫీలు దిగుతుంటారు. ఇలాంటి ఘటనల్లో అనేకమంది మరణించారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని గుజరాత్‌లోని దంగ్ జిల్లా అధికారులు సెల్ఫీలను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఫైన్‌తో పాటు జైలు శిక్ష తప్పదంటూ తీవ్రంగా హెచ్చరించారు.
సాత్పుర లాంటి టూరిస్ట్ ప్రదేశాల్లో సెల్ఫీలు దిగడం తీవ్ర నేరమని అధికారులు స్పష్టంచేశారు. ఈమేరకు జూన్ 23నే అదనపు కలెక్టర్ టీకే. దామూర్ పబ్లిక్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా నీటి ప్రవాహాల ప్రాంతాలను సెల్ఫీ బ్యాన్ ఏరియాలుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వర్షాకాలం కావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉందని.. ఈ ప్రదేశాల్లో దుస్తులు ఉతకడం, ఈత, స్నానం చేయడం లాంటివి నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
గతంలో 2019లో వాఘై-సాపుతరా హైవేపై సెల్ఫీలను దిగడం నిషేధించిన విషయాన్ని అధికారులు ప్రస్తావిస్తున్నారు. చాలామంది ప్రకృతిని ఆస్వాదిస్తున్నమన్న వంకతో.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. కాగా, కరోనా నిషేధాజ్ఞలు ఎత్తివేయడంతో ప్రస్తుతం దంగ్ టూరిస్ట్ ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫీ నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. అయితే.. ఎత్తైన ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలో చోటుచేసుకుంటున్నాయి. కొండలు, నీటి ప్రాంతాల్లో సెల్ఫీలు, ఫోటోలు దిగి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని.. కేరళలోని పలు టూరిస్ట్ ప్రాంతాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.
Also Read;