Ap Crime News: పైనుంచి చూస్తే అల్లం లోడే… లోపల చెక్ చేసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది
గంజాయి వ్యాపారం సాగిస్తున్న ముఠాలు పెట్రేగిపోతున్నాయి. రోజుకో కొత్త మార్గంలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. అధికారులకే షాక్ ఇస్తున్నారు కేటుగాళ్లు.
గంజాయి వ్యాపారం సాగిస్తున్న ముఠాలు పెట్రేగిపోతున్నాయి. రోజుకో కొత్త మార్గంలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. అధికారులకే షాక్ ఇస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా విజయనగరం జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి సుమారు కోటి 50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లం మాటున గంజాయి తరలిస్తున్నారంటూ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకి సమాచారం రావడంతో విజయనగరం రూరల్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, రూరల్ పోలీసులు కలిసి వాహనాన్ని పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. పట్టుబడిన ముగ్గురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరవింద్ కుమార్, భరత్‌సింగ్, సత్యబాన్‌సింగ్‌గా పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో వాహనాల తనిఖీ ఏర్పాటు చేసి ఒడిస్సా నుండి గంజాయి లోడ్ చేసుకుని విజయనగరం ఏజెన్సీ మీదుగా విశాఖ వైపు వెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
కేసు వివరాలను ఎస్పీ.రాజకుమారి వెల్లడించారు. అల్లం మాటున గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించామని, వాహనంలో అల్లం కాకుండా 3 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సిమిలిగూడలో గంజాయి లోడు చేసి.. ఢిల్లీకి తరలిస్తున్నట్టు నిందితులు వెల్లడించారన్నారు. కొనుగోలుదారుడు, విక్రయదారుల వివరాలు సేకరిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ.రాజకుమారి తెలిపారు. ఈ కేసు దర్యాప్తును రూరల్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.
Also Read:1300 కిలోల బరువు భారీ సొర చేప వలకు చిక్కితే సిరుల పంటే అనుకున్నారు… కానీ