Viral News: భార్య భర్త బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడింది.. అతడు ఏం చేశాడో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది
జనరేషన్స్ మారిపోతున్నాయి. మానవ సంబంధాలు కొత్త పోకడలు అందుకుంటున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో కాపురాలు నాశనం చేసుకున్న ఎన్నో ఘటనలు...
జనరేషన్స్ మారిపోతున్నాయి. మానవ సంబంధాలు కొత్త పోకడలు అందుకుంటున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో కాపురాలు నాశనం చేసుకున్న ఎన్నో ఘటనలు మనం ఇప్పటివరకూ చూశాం. కానీ తాజాగా భార్య మరో మహిళను ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న వ్యక్తి ఏమి చేశాడో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఒక వ్యక్తి తన భార్యను ప్రేమించిన అమ్మాయిని ఏకంగా ఇంటికి తీసుకువచ్చి ఆశ్యర్యానికి గురిచేశాడు. అమెరికాలోని సీటెల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక భర్త తన భార్య ద్విలింగ సంపర్కురాలని తెలియడంతో, ఆమెను అర్థం చేసుకుని లైఫ్‌లో గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అతడు తన భార్యను ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడు. ఇప్పుడు ఆ ముగ్గురూ కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే… కాటి, జస్టిన్ ప్రేమకథ 2006 లో కామెడీ షో సందర్భంగా ప్రారంభమైంది. జస్టిన్ వృత్తిరీత్యా హాస్యనటుడు. కాటి రుప్పల్ రియల్ ఎస్టేట్ అసోసియేట్. వారిద్దరి మధ్య అనుకోకుండా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చాలా సంవత్సరాలు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తరువాత, 2013 లో వివాహం చేసుకున్నారు. అయితే ఒక రోజు, కాటి తన మనసులో దాచుకన్న సీక్రెట్‌ను తన భర్త జస్టిన్‌తో చెప్పింది. ఇది విన్నప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. కాటి తాను ద్విలింగ సంపర్కురాలినని భర్తతో చెప్పింది. అంతేకాదు భర్త స్నేహితురాలు క్లైర్‌ను ఇష్టపడుతున్నట్లు వివరించింది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో క్లైర్‌ను చూసి.. అట్రాక్ట్ అయినట్లు భర్తకు చెప్పింది. దీంతో క్లైర్‌ని ఇంటికి ఆహ్వానించి ఈ విషయం గురించి డిస్కస్ చేశాడు జస్టిన్. క్లైర్ మొదట ఈ విషయం వినగానే ఆశ్యర్యానికి లోనైంది. అయినప్పటికీ కాటిని అర్థం చేసుకుని.. ఆమెతో బందాన్ని కొనసాగించేందుకు నిర్ణయించుకుంది. దీంతో ఈ ముగ్గురూ ఎటువంటి ఇబ్బందులు లేకుండానే తమ బంధాలను కొనసాగిస్తున్నారు. వీరి నిర్ణయం కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. కానీ చాలాసార్లు ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. “మా భాగస్వామ్యం గురించి మేము గర్విస్తున్నాము. ఒకరిని ప్రేమించటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని విమర్శించే వారు ఈ తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము” అని వారు ముక్తకంఠంతో చెబుతున్నారు.