ఆఫీస్‌లో కొలిగ్ కొన్ని సంవత్సరాల క్రితం టిఫిన్ దొంగిలించి తిన్నాడు.. నిజం తెలియగానే ఆ వ్యక్తి ఏం చేశాడంటే

ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి తన బాల్యంలో ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. ఎటువంటి కల్మషం లేని స్నేహాలు దొరికేది అప్పుడే. 

ఆఫీస్‌లో కొలిగ్ కొన్ని సంవత్సరాల క్రితం టిఫిన్ దొంగిలించి తిన్నాడు.. నిజం తెలియగానే ఆ వ్యక్తి ఏం చేశాడంటే
Tiffin Theft
Follow us

|

Updated on: Jul 12, 2021 | 9:10 AM

ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి తన బాల్యంలో ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. ఎటువంటి కల్మషం లేని స్నేహాలు దొరికేది అప్పుడే. బాల్యంలో, చేసిన కొన్ని తింగరి పనులు తలుచుకుంచే ఇప్పటికి కూడా నవ్వు వస్తుంది. ఈ అల్లరిలో ప్రధానమైనది స్కూల్, లేదా కాలేజ్‌లో ఒకరి టిఫిన్ దొంగిలించి తినడం. కొన్నిసార్లు యంగ్ పీపుల్‌ కూడా ఇలాంటి అల్లర్లు చేస్తారు. అయితే  ఒక వ్యక్తి తన టిఫిన్ దొంగను వెతకడానికి ఐదు సంవత్సరాలు గడిపాడు. అనంతరం నిజం తెలిసిన వెంటనే అతడిపై దాడి చేశాడు. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది.  ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఐదేళ్ల క్రితం ఒక కార్యాలయ ఉద్యోగి తన సహోద్యోగి అయిన మాథ్యూ ఎవాన్స్ టిఫిన్ బాక్స్ కొట్టేశాడు. అందులోని సాసేజ్ రోల్స్ తిన్నాడు. ఈ విషయం గురించి ఆ సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. కాని దొంగతనం ఎవరు చేశారనే దానిపై స్పష్టత లేకపోవడంతో.. అప్పుడు వాతావరణం సద్దుమణిగింది.  గతేడాది, వారిద్దరూ ఈ విషయంపై మళ్ళీ గొడవ పడ్డారు. పదే, పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండటంతో.. టిఫిన్ కొట్టేసిన వ్యక్తికి చిరెత్తుకొచ్చింది. అవును దొంగతనం నేనే చేశా అని ఒప్పుకున్నాడు. దీంతో మాథ్యూ ఎవాన్స్ కోపోద్రేకంతో అతడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో కేసుల వరకూ వెళ్లింది వ్యవహారం.  కోర్టులో విచారణ తరువాత, మాథ్యూకు 4 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తరువాత, టిఫిన్ కోసం ఒక వ్యక్తిని చంపేందుకు ప్రయత్నించడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Also Read: భూమి మీద బతికుండాలని రాసి పెట్టి ఉంటే…గోదాట్లో దూకిన చావు రాదంటారు !.. ఇప్పుడు అదే జరిగింది

స్టార్ అవ్వాలన్న అర్ధాంగి ఆరాటమే అతడి ప్రాణాలు తీసిందా..? వెలుగులోకి కొత్త కోణాలు