Big Fish:1300 కిలోల బరువు భారీ సొర చేప వలకు చిక్కితే సిరుల పంటే అనుకున్నారు… కానీ
సొరచేపను అందరూ చూసేవుంటారు కదా..! కొంతమంది ఇష్టంగా కూడా తింటారు. కానీ.. పులి చర్మం వర్ణంలో ఉన్న సొరచేపను ఎక్కడైనా చూశారా..?..
సొరచేపను అందరూ చూసేవుంటారు కదా..! కొంతమంది ఇష్టంగా కూడా తింటారు. కానీ.. పులి చర్మం వర్ణంలో ఉన్న సొరచేపను ఎక్కడైనా చూశారా..?! అవును.. దీని చర్మమంతా పులితోలును పోలినట్టు కనిపిస్తుంది. చిరుతపులిలా చర్మంపై చుక్కలు, వర్ణం ఉంటుంది. అందుకే దీనికి పులిబుగ్గల సొరచేప అని కూడా అంటారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఈ భారీ పులిబుగ్గల సొరచేప కనువిందు చేసింది. వేటకు వెళ్ళిన మత్స్యకార బోటుకు ఈ భారీ చేప చిక్కడంతో తీరానికి తీసుకొచ్చారు. 1300 కిలోల బరువు.. పన్నెండున్నర అడుగుల పొడవుండే ఈ భారీ చేపను వేలానికి పెట్టారు. అయితే.. ఈ చేపను తెలుగురాష్ట్రాల్లో తినడానికి ఇష్టపడరు. దీంతో.. ఇది నాలుగువేల రూపాయల మాత్రమే వేలం పలికింది. ఈ చేపను ఒడ్డుకు చేర్చేందుకు 150 మంది మత్స్యకారులు 3 గంటలపాటు శ్రమించారు. అలాగే 500 లీటర్ల డీజిల్ ఖర్చైంది. అంత భారీ చేప చిక్కినా ఎలాంటి లాభం రాకపోవడంతో మత్స్యకారులు నిరాశచెందారు.
నిజామాబాద్ జిల్లాలో చిక్కిన భారీ బొచ్చ చేప…
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణా కలాన్ శివారులో అలీసాగర్ జలాశయం ఉంది. ఈ జలాశయంలో శనివారం నాడు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఆ సమయంలో వారు వేసిన వలకు 30 కిలోల చేప చిక్కింది. అది చూసి మత్స్యకారులు షాక్ అయ్యారు. ఇంత పెద్ద చేప దొరకడంతో వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. వలకు చిక్కిన భారీ చేపను చూసి మురిసిపోయారు. అయితే, ఇది ‘బొచ్చ’ రకానికి చెందినదని మత్స్యకారులు చెబుతున్నారు. ఆ భారీ చేపను చేతిలో పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.