AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజస్థాన్‌లో విషాదం.. ఊపిరాడక ఐదుగురు పిల్లల మృతి

Five Children Death: రాజస్థాన్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఊపిరాడక ఐదుగురు పిల్లలు

రాజస్థాన్‌లో విషాదం.. ఊపిరాడక ఐదుగురు పిల్లల మృతి
Five Children Death In Bikaner
Shaik Madar Saheb
|

Updated on: Mar 21, 2021 | 10:54 PM

Share

Five Children Death: రాజస్థాన్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఊపిరాడక ఐదుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రంలోని బికనీర్‌ జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం వేళ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఆటలాడుకుంటూ.. వెళ్లి ధాన్యం నిల్వ చేసే కంటైనర్‌లో పడి ఊపిరాడక చనిపోయారు. మృతిచెందిన చిన్నారులంతా 3 నుంచి 8 ఏండ్ల మధ్య వారే ఉన్నారు. మృతుల్లో నలుగురు బాలికలు, ఒక బాలుడు ఉన్నాడు.

అయితే.. కంటైనర్‌ దాదాపు ఖాళీగా ఉందని.. పిల్లలు ఆడుకుంటుండగా.. దానిలో పడ్డారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పైన మూత కూడా మూసుకుపోవడంతో ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు. పోలానికి వెళ్లొచ్చిన భీరామ్ దంపతులకు పిల్లలెవరూ కనిపించకపోవడంతో వెతికారు. ఈ క్రమంలో తల్లి కంటైనర్‌ను తెరవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో నలుగురు పిల్లలు భీరామ్ దంపతుల పిల్లలు కాగా.. మరో బాలిక ఆయన మేనకోడలని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలోని ఐదుగురు పిల్లల ప్రాణాలు పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Also Read

AADHAR CARD: పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ‘జీవన్ ప్రమాణ్’ కోసం ఆధార్ తప్పనిసరి కాదన్న కేంద్రం

Follow Us
ఈ పండును రాత్రిపూట తింటున్నారా?.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే!
ఈ పండును రాత్రిపూట తింటున్నారా?.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే!
రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి
రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి
దేవకన్యలా మెరిసిన కామాక్షి భాస్కర్ల
దేవకన్యలా మెరిసిన కామాక్షి భాస్కర్ల
క్యూట్ స్మైల్‌తో కుర్రకారుని కట్టిపడేస్తున్న పాయల్ రాజ్ పుత్
క్యూట్ స్మైల్‌తో కుర్రకారుని కట్టిపడేస్తున్న పాయల్ రాజ్ పుత్
కఠిన హృదయాలను సైతం కన్నీళ్లు తెప్పించిన ఘటన!
కఠిన హృదయాలను సైతం కన్నీళ్లు తెప్పించిన ఘటన!
రాగి పిండితో ఇలా సూప్ చేసి తాగితే తస్సాదియ్యా.. సమ్మర్‌లోనూ బాడీ
రాగి పిండితో ఇలా సూప్ చేసి తాగితే తస్సాదియ్యా.. సమ్మర్‌లోనూ బాడీ
వేసవిలో మలబద్ధకం వదిలించుకోవడం ఎలా?.. పర్మినెంట్ సొల్యూషనిది
వేసవిలో మలబద్ధకం వదిలించుకోవడం ఎలా?.. పర్మినెంట్ సొల్యూషనిది
ఏఎన్నార్ కళ్లముందే డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టింది.. ఆ తర్వాత.!
ఏఎన్నార్ కళ్లముందే డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టింది.. ఆ తర్వాత.!
బాత్రూం షవర్లో వాటర్ ఫ్లో తగ్గిపోయిందా?.. ఇలా చేయకుంటే డేంజర్
బాత్రూం షవర్లో వాటర్ ఫ్లో తగ్గిపోయిందా?.. ఇలా చేయకుంటే డేంజర్
పాక్ బుద్ధి మారకపోతే.. ఈసారి ఖేల్ ఖతంః రాజ్‌నాథ్
పాక్ బుద్ధి మారకపోతే.. ఈసారి ఖేల్ ఖతంః రాజ్‌నాథ్