AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్..! అయితే వీరు కాస్తా వెరైటీ..! దొరికిపోయారు..! దాచింది ఎక్కడో తెలుసా..?

Smuggling Gold: హాలీవుడ్‌ రేంజ్‌లో థ్రిల్లర్‌‌ సీక్వెన్స్‌ పండించి అడ్డంగా దొరికిపోయారు గోల్డ్‌ స్మగ్లర్స్‌. సినీ ఫక్కీలో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ.. ఎయిర్‌పోర్ట్‌ను దాటించేయాలని చూశారు. కాని మన దేశంలో కస్టమ్స్‌ అధికారుల కళ్లుగప్పడం అంత ఈజీ కాదని మళ్లీ తేలిపోయింది.

Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్..! అయితే వీరు కాస్తా వెరైటీ..! దొరికిపోయారు..! దాచింది ఎక్కడో తెలుసా..?
Smuggling Gold
Sanjay Kasula
|

Updated on: Mar 21, 2021 | 9:20 PM

Share

Smuggling Gold: ఎయిర్‌పోర్ట్‌ అంటేనే భద్రతకు కేరాఫ్.. నీడలా వెంటాడే సీసీ కెమెరాలు.. ప్యాసింజర్ల కదలికల్ని పసిగట్టే సెక్యూరిటీ.. లగేజీని బిట్ టు బిట్ స్కాన్‌ చేసే స్కానర్లు.. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నా స్మగ్లర్లు లెక్కచేయడం లేదు. మాదారి అడ్డదారి అంటూ.. విదేశాల్లో డెడ్‌చీప్‌గా దొరుకుతున్న బంగారాన్ని దేశంలోకి డంప్ చేస్తున్నారు. అలాంటి వాళ్లలో చాలామంది చెన్నై ఎయిర్‌పోర్ట్‌నే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంతకీ స్మగ్లర్లు చెన్నై ఎయిర్‌పోర్ట్‌నే ఎందుకు ఎంచుకుంటున్నారు..? పదేపదే పట్టుబడుతున్నా కొత్త ఎత్తులకి ఎందుకు సాహసిస్తున్నారు..?

చెన్నై విమానాశ్రయంలో భారీ గా పట్టుబడ్డ బంగారం… ఇది రొటిన్ వార్తే. కానీ లెటెస్ట్‌గా దొరికిన దొంగ దండు బంగారం దాచిన స్టయిలే కొత్తది. మొత్తం 6 వ్యక్తులు దగ్గర బంగారం ఉన్నట్టు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. కానీ ఎక్కడ.. ఎలా .. అన్నది ఐడింటిఫై చేసేందుకు కిందామీదా పడ్డారు. ఫైనల్‌గా  పసిడిని దాచింది ఎక్కడో నిర్ధారణకు వచ్చారు. రూ. 2.53 కోట్లు విలువ చేసే5.55 కేజీల బంగారం సీజ్ చేశారు.

ఒకరు చెప్పుల్లో.. ఇంకొకరు ప్యాంట్‌ బెల్ట్‌లో.. మరొకరు బిస్కెట్ల రూపంలో.. కాదేదీ అనర్హం అంటూ గోల్డ్ స్మగ్లర్లు అన్ని అడ్డదారులు తొక్కేస్తున్నారు. విదేశాల నుంచి కిలోలకొద్ది బంగారాన్ని వేర్వేరు స్టయిళ్లలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎయిర్ పోర్ట్ లలో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా, నిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతూనే ఉంది. ఏకంగా కడుపులో బంగారం పెట్టుకుని మహిళలే స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి చిత్రవిచిత్రాలన్నింటికి చెన్నై ఎయిర్‌పోర్ట్‌ కేంద్రంగా నిలిచింది.

గోల్డ్‌ ఎక్కువగా వినియోగిస్తున్న ప్రాంతాలకే ఎక్కువగా సరఫరా అవుతోంది. ఇండో-మయన్మార్, ఇండో నేపాల్, ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి స్మగ్లింగ్ అవుతోంది. ముఖ్యంగా చెన్నైకి శ్రీలంక, దుబాయ్, షార్జా ల నుంచి చాలామంది ప్రయాణికులు వస్తుంటారు. అక్కడ చీప్‌గా దొరికే బంగారాన్ని ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. కొంతమంది సొంత అవసరాలకు కూడా తీసుకొస్తున్నారు. కస్టమ్స్ అధికారుల చాకచాక్యంతో అక్రమ బంగారమంతా పట్టుబడుతోంది.

smuggling gold

smuggling gold

హాలీవుడ్‌ రేంజ్‌లో థ్రిల్లర్‌‌ సీక్వెన్స్‌ పండించి అడ్డంగా దొరికిపోయారు గోల్డ్‌ స్మగ్లర్స్‌. సినీ ఫక్కీలో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ.. ఎయిర్‌పోర్ట్‌ను దాటించేయాలని చూశారు. కాని మన దేశంలో కస్టమ్స్‌ అధికారుల కళ్లుగప్పడం అంత ఈజీ కాదని మళ్లీ తేలిపోయింది.

04

04

గత రెండు రోజులుగా గల్ఫ్‌కు వెళ్లే, గల్ఫ్‌ నుండి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేయగా 5.55 కేజీల బంగారం, రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 2.53 కోట్లుగా సమాచారం. విగ్స్‌, సాక్సులు, ఇన్నర్‌వేర్‌, పేస్టు రూపంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి: Malaika Arora Is The Hottest: బోల్డ్ ఫోటోలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్న మలైకా అరోరా.. లైక్ చేసిన ప్రియుడు అర్జున్ కపూర్

Next CJI..?: సీజేఐ రేసులో ఎవరు ఉన్నారు…? కొత్త భారత ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు బిడ్డ రాబోతున్నాడా..!