Next CJI..?: సీజేఐ రేసులో ఎవరు ఉన్నారు…? కొత్త భారత ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు బిడ్డ రాబోతున్నాడా..!
Chief Justice of India: కొత్త భారత ప్రధాన న్యాయమూర్తి నియామకానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ లోగానే ఎంపిక పూర్తి....
కొత్త భారత ప్రధాన న్యాయమూర్తి నియామకానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ లోగానే ఎంపిక పూర్తి చేయాలని భావిస్తోంది. తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సిఫారసు చేయాలని జస్టిస్ ఎస్ఏ బాబ్డేను కోరింది కేంద్రం. సీజేఐ రేసులో ఎవరు ఉన్నారు?.. ఎవర్ని ఆ పదవి వరించబోతుందన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
సినియారిటీ ప్రకారం ముందు వరుసలో జస్టిస్ ఎన్వీ రమణ ఉన్నారు. ఆ తర్వాత రోహింగ్టన్ నారిమన్, యూయూ లలిత్‌లు ఉన్నారు. అయితే ఎస్‌ఐ బాబ్డే ఎవరి పేరును కేంద్రానికి రిఫర్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాబ్డే సూచించిన వారినే కేంద్రం చీఫ్ జస్టిస్‌గా నియమిస్తుందని తెలుస్తోంది.
సీజేఐ నియామక ప్రక్రియ ఇలా..
ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల ఎంపిక విధానం ప్రకారం.. తగిన అర్హతలున్న సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జిని భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. తదుపరి సీజేఐ నియామకం కోసం, తగిన సమయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవీ విరమణ చేయబోతున్న సీజేఐ సిఫారసును కోరాలని ఈ నిబంధనలు చెబుతున్నాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఈ ప్రక్రియలో భాగంగా సీజేఐ సిఫారసును ప్రధాన మంత్రికి సమర్పిస్తారు. ప్రధాన మంత్రి సలహా మేరకు సీజేఐని రాష్ట్రపతి నియమిస్తారు.
ముందుగా ప్రధాని దగ్గరకు..
సిజే సిఫార్సులతో న్యాయశాఖ నుంచి ప్రధాని దగ్గరకు ఫైల్ చేరనుంది. ఆ తర్వాత ప్రధాని సూచన మేరకు చీఫ్ జస్టిస్ ను రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. సినీయార్టీ ప్రకారమైతే జస్టిస్ ఎన్వీ రమణ ముందున్నారు. ఆయన పదవీకాలం 2022, ఆగస్ట్ 26వరకు ఉంది. అయితే ఆయన పేరునే ఫైనల్ చేస్తారా.. లేదంటే సీన్‌లోకి జస్టిస్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్‌లు వస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది.
జస్టిస్ ఎన్వీ రమణ కెరీర్..
సీజేఐ రేసులో ముందుంది జస్టిస్ ఎన్వీ రమణ… కృష్ణా జిల్లా పొన్నవరంలో 1957 ఆగస్టు 27న జన్మించారాయన. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా 2017 ఫిబ్రవరి 2న నియమితులయ్యారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం అంటే, 2022 ఆగస్టు 26 వరకూ ఆయనకు సర్వీసు ఉంది. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్, ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు.
2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంటు జడ్జిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.