Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram Crime News: మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌ చూసి.. ఓ సోల్జర్‌… క్రిమినల్‌గా మారాడు.. ఇంతకీ ఏం చేశాడంటే..?

మీర్జాపూర్‌ అనే వెబ్‌ సిరీస్‌ చూసి ఓ వ్యక్తి కోట్ల రూపాయలు సంపాదించాలని స్కెచ్‌ వేశాడు. వెబ్‌సిరీస్‌లో చూపించినట్టుగా నాటు తుపాకులతో బెదిరింపులకు దిగాడు....

Vizianagaram Crime News: మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌ చూసి.. ఓ సోల్జర్‌... క్రిమినల్‌గా మారాడు.. ఇంతకీ ఏం చేశాడంటే..?
Army Jawan Thretnes
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 21, 2021 | 8:40 PM

మీర్జాపూర్‌ అనే వెబ్‌ సిరీస్‌ చూసి ఓ వ్యక్తి కోట్ల రూపాయలు సంపాదించాలని స్కెచ్‌ వేశాడు. వెబ్‌సిరీస్‌లో చూపించినట్టుగా నాటు తుపాకులతో బెదిరింపులకు దిగాడు. అయితే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తేడా వస్తే బొమ్మ అట్టర్‌ ప్లాప్‌ అయినట్లు..మనోడి ప్లాన్‌ కూడా బెడిసికొట్టింది. తాజాగా చందనాపల్లి రాజేశ్వరరావు అనే ఓ సోల్జర్‌ ఇటీవల ఫేమస్‌ అయిన మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌ చూసి, అప్పుల బాధ నుంచి విముక్తి పొంది అర్ధరాత్రి కోటీశ్వరుడు అయిపోవాలని స్కెచ్ వేశాడు. కానీ ప్లాన్‌ బెడిసికొట్టడంతో కటకటాల పాలయ్యాడు.

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బంటువానివలస కు చెందిన చందనా పల్లి రాజేశ్వరరావు రూర్కీ కంటోన్మెంట్ లో ఆర్మీ సోల్జర్‌. అక్కడ ఉన్న సమయంలోనే పార్వతీపురం లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు.. ఆ బిజినెస్‌లో సుమారు 22 లక్షలు నష్టపోయాడు.. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎలాగైనా డబ్బు సంపాదించాలని అక్రమ మార్గాల బాటపట్టాడు. నెల రోజుల కిందట యూపీలో పిస్టల్‌ కొన్న రాజేశ్వరరావు నకిలీ మావోయిస్టు అవతారమెత్తి బెదిరింపులకు దిగాడు.

పార్వతీపురంలోనే బాగా డబ్బున్న బంగారు వ్యాపారి ఇందువూరు చిన గుంపస్వామికి ఫోన్ చేసి తాను జార్ఖండ్ మావోయిస్టుగా రాజేశ్వర్‌రావు పరిచయం చేసుకున్నాడు.. తనకు డబ్బు అవసరమని మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే నీతో పాటు మీ ఫ్యామిలీకి ఇబ్బందులు తప్పవంటూ డాన్‌ స్టైల్‌లో బెదిరించాడు. .తాను చెప్పిన నగదు కొమరాడ మండలం విక్రంపురం దగ్గరకు తీసుకురావాలని వార్నింగ్‌ ఇచ్చాడు. ఫోన్‌ బెదిరింపులపై అనుమానం వచ్చిన వ్యాపారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు రెండు టీమ్ లుగా ఏర్పడి నిందితుడు కోసం గాలించారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో మావోయిస్టు గా చెలామణి అవుతున్న రాజేశ్వరరావును అరెస్ట్ చేశారు పోలీసులు. రాజేశ్వరరావు దగ్గర నుంచి దేశీయ పిస్తోలు, నకిలీ కరెన్సీ, మొబైల్స్, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.. బెదిరింపుల దందాలేనా? ఇంకా ఏమైనా చేశాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసి అక్రమమార్గాలను ఎంచుకొని జైలు పాలు కావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read: Viral Photo: “నీడ్ ఈజ్‌ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్”.. అడ్డెడ్డె ఏమి ఐడియా గురూ.. సూపర్బ్..

Mongoose Vs Cobra: కింగ్ కోబ్రాను ఒక్క నిమిషంలో ఖతం చేసింది.. ఈ ముంగిస స్కిల్స్ అదుర్స్…