AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murder: అలా చేస్తున్న భర్త.. వద్దని చెప్పిన భార్య.. చివరికి కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..?

పెళ్లైంది.. ఇద్దరు కుమారులు ఉన్నారు.. కానీ అతడు పక్కదారి పట్టాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు తన ఆస్తి ఇవ్వాలని చూశాడు. చివరకు..

Murder: అలా చేస్తున్న భర్త.. వద్దని చెప్పిన భార్య.. చివరికి కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..?
Crime News
Srinivas Chekkilla
|

Updated on: Oct 03, 2021 | 3:25 PM

Share

పెళ్లైంది.. ఇద్దరు కుమారులు ఉన్నారు.. కానీ అతడు పక్కదారి పట్టాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు తన ఆస్తి ఇవ్వాలని చూశాడు. చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటలోని శివమొగ్గ జిల్లా అచాపురం గ్రామానికి చెందిన వినోద్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వినోద్ అదే గ్రామంలో ఉన్న మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంట్లో ఉండడం కంటే అతను ఆ మహిళ వద్దే ఎక్కువ ఉండేవాడు. అనుమానం వచ్చిన భార్య నిఘా పెట్టగా… తన భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. దీంతో భర్తను నిలదీసింది. అయినా అతడు పద్ధతి మర్చుకోలేదు. భార్యతో పాటు కుటుంబ సభ్యులు అతడితో గొడవకు దిగారు. అయినా వినోద్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. వివాహేతర సంబంధమే పెట్టుకోవడమే కాకుండా వినోద్ తన ఆస్తిని కూడా ఆ మహిళకు ఇవ్వాలనుకున్నాడు. ఇందులో భాగంగానే తనకున్న ఆస్తిని అమ్మి అందులో కొంతభాగం ప్రియురాలికి ఇవ్వాలని నిర్ణయించాడు. ఆ విషయం ఇంట్లో తెలియడంతో వినోద్‌కు వద్దని నచ్చెప్పారు.. కాని వినోద్ మాత్రం వినలేదు.. విసుగు చెందిన భార్య కుమారులు, బిను, వివేక్‎తోపాటు ఇతర కుటుంబ సభ్యులు వినోద్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు.

గత వారం రోజుల క్రితం వినోద్ ఇంట్లో ఉన్న సమయంలోనే బలవంతంగా ఆయన మెడకు తీగను చుట్టారు. ఉరి బిగించి ఊపిరాడకుండా చేశారు.. అంతటితో ఆగకుండా రాడ్‌తో తలపై బాదడంతో కిందపడిపోయిన వినోద్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని కారులో వేసుకుని గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. వినోద్‌ శవన్ని కారులోనే కారుపై పెట్రోల్ పోసి తగుల బెట్టారు. ఆ తర్వాత తాపిగా వెళ్లి వినోద్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు ప్రవర్తనలో తేడా కనిపించటంతో వారిని విచారించారు. మొదట తమకు ఏమి తెలియదని చెప్పిన వారు.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నారు. వినోద్‎ను హత్య చేశామని అతని భార్యతోపాటు ఇద్దరు కుమారులు, సోదరుడు ఒప్పుకున్నాడు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు తరలించారు.

Read Also.. ATM robbery: సరిహద్దు జిల్లాలే టార్గెట్‌.. ఏటీఎం మెషీన్లను పగులగొట్టి హర్యానా గ్యాంగ్ వరుస చోరీలు