Extramarital Affair: ఇద్దరితో వివాహేతర సంబంధం.. గర్భం దాల్చిన మహిళ.. ప్రియుల ఫైట్.. చివరికి
ఆమెకు పెళ్లైంది.. కానీ ఆమె చేసిన పనికి ఒక ప్రాణం పోవటంతోపాటు మరొకరిని జైలు పాలు చేసింది...
ఆమెకు పెళ్లైంది.. కానీ ఆమె చేసిన పనికి ఒక ప్రాణం పోవటంతోపాటు మరొకరిని జైలు పాలు చేసింది. ఆమె ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగించి.. గర్భం దాల్చింది. ప్రియురాలు గర్భం దాల్చడంతో పుట్టబోయే బిడ్డకు తండ్రిని తానంటే తానంటూ ఇద్దరు యువకులు కొట్లాడుకున్నారు. ఈ ఘర్షణలో ఒకరు చనిపోగా.. మరొకరు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలం జిల్లా అయోధ్య పట్టణంలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన మురుగేశన్కు పెళ్లైంది. కానీ అనివార్య కారణాలతో అతను భార్యను విడిచిపెట్టాడు. కొద్ది రోజులు ఒంటరిగా ఉన్న అతడు తల్లిదండ్రుల ఒత్తిడి రెండో వివాహం చేసుకోవాలనుకున్నాడు. దీంతో కొంత కాలం క్రితం కలైమణి(23) అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు.
అయితే కలైమణికి పెళ్లికి ముందు నుంచే అరసన్(23), కృపై రాజ్(23) అనే ఇద్దరు యువకులతో పరిచయం ఉంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కలైమణి భర్తకు తెలియకుండా ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. ఇటీవల ఆమె గర్భం దాల్చింది. తనకు బిడ్డ పుట్టబోతుందని తెలుసుకుని మురుగేశన్ ఆనందంతో పొంగిపోయాడు. కానీ ఇంతలో అతనికి ఓ దారుణమైన నిజం తెలసింది. తన భార్య ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ఆ ఇద్దరు ఘర్షణ పడ్డారని తెలిసింది.
ఏం జరిగింది?
ప్రియురాలు గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు ఆమె వద్దకు వచ్చారు. అక్కడే వారి మధ్య కొత్త వివాదం చెలరేగింది. కలైమణికి పుట్టబోయే బిడ్డకు తండ్రిని తానంటే తానంటూ ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే అరసన్ విచక్షణ మరిచి కత్తితో కృపైరాజ్‌పై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కృపైరాజ్‌పై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కలైమణి, కలై అరసన్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Read Also.. Kannada Tv Actress Soujanya: యువనటి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. ప్రియుడిపై తండ్రి ఫిర్యాదు..