Suspension: మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం.. ఇందల్వాయి ఎస్ఐపై వేటు.. 

Indalwai SI : ఇందల్వాయి పోలీసు స్టేషన్‌ ప్రొబేషనరీ ఎస్సై శివప్రసాద్‌రెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. ఎస్ఐతో మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం సంచలనంగా

Suspension: మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం.. ఇందల్వాయి ఎస్ఐపై వేటు.. 
Indalwa Si Suspension
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 13, 2021 | 8:51 AM

Indalwai SI : ఇందల్వాయి పోలీసు స్టేషన్‌ ప్రొబేషనరీ ఎస్సై శివప్రసాద్‌రెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. ఎస్ఐతో మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం సంచలనంగా మారింది. అయితే.. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ భర్త శివాజీరావు శారీరక, మానసిక వేధింపులకు గురయ్యాడు. ఇది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఐపీసీ 306 సెక్షన్‌ కింద కామారెడ్డి జిల్లా గాంధారి పోలీసులు కేసును నమోదు చేశారు. ఏ1 గా మహిళా కానిస్టేబుల్‌ను, ఏ2 గా ఎస్సై శివప్రసాద్‌ రెడ్డిని చేర్చారు. వివరాలు.. గాంధారి మండలం మాదవపల్లిలో మూడు రోజుల క్రితం శివాజీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు ఎస్ఐ, కానిస్టేబుల్ కారణమంటూ గ్రామస్తులు అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వరకు ఆందోళన నిర్వహించారు. గాంధారి, కామారెడ్డి ప్రధాన రహదారిపై రాళ్లు, ముళ్ల కంపలు అడ్డంగా వేసి ఆందోళ చేశారు. కదిలి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐపై చర్యలకు ఉపక్రమించారు.

ఎస్సై శివప్రసాద్‌రెడ్డిని సస్పెన్షన్‌ చేస్తూ సీపీ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ  సాక్ష్యాలు రుజువైతే 10 ఏళ్ల శిక్షతోపాటు ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన శివప్రసాద్‌రెడ్డి 2019 డిసెంబర్‌లో ప్రొబేషనరీ ఎస్సైగా ఇందల్‌వాయిలో నియమితులయ్యారు. అయితే ఈ కాలంలోనే శివప్రసాద్‌ రెడ్డి విచ్చలవిడిగా వసూళ్ల కార్యక్రమం చేపట్టినట్లు,  భూ దందాలు సెటిల్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని.. ఆమె భర్తను కూడా వేధించినట్లు సమచారం.

Also Read:

Telangana Home Minister: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో పోలీస్ శాఖలో 20 వేల పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్

Telangana CM KCR: ప్రగతి భవన్‌లో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష.. పలు కీలక అంశాలపై చర్చ..!