Accident: కిక్కు తలకెక్కింది… బైక్స్‌ను వరసగా గుద్దుకుంటూ వెళ్లాడు.. షాకింగ్ విజువల్స్

తమిళనాడులోని సేలం జిల్లా శివపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

Accident: కిక్కు తలకెక్కింది... బైక్స్‌ను వరసగా గుద్దుకుంటూ వెళ్లాడు.. షాకింగ్ విజువల్స్
Tamil Nadu Accident
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 26, 2021 | 10:04 AM

తమిళనాడులోని సేలం జిల్లా శివపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు.  బైకర్స్‌ తమ మానాన తాము వెళ్తున్నారు. అది కూడా రోడ్డుకు ఒకపక్కగా వెళ్తున్నారు. కారు డ్రైవర్‌ మాత్రం ఒక్కసారిగా శివాలెత్తిపోయినట్టు డ్రైవ్ చేశాడు. అమాయకులను అడ్డంగా గుద్దేశాడు. ఏకంగా మూడు బైక్‌లను ఢీ కొట్టాడు. తాగి డ్రైవింగ్ చేయొద్దని నెత్తీ, నోరూ మొత్తుకుంటున్నా కొందరు వినట్లేదు. ఇది కూడా డ్రంకన్ డ్రైవ్ యాక్సిడెంట్‌గా పోలీసులు గుర్తించారు. తప్పతాగి బండి నడిపేవారిని మానవ బాంబులంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నా.. వాళ్ల తీరు మారడం లేదు.

కదిరి పట్టణంలో లారీ బీభత్సం….

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో సిమెంటు లారీ బీభత్సం సృష్టించింది. మదనపల్లి నుంచి పులివెందుల వైపు 42వ నంబర్ నేషనల్ హైవేపై వెళుతున్న లారీ.. కదిరి పట్టణ శివారు ప్రాంతం నుంచి అతి వేగంగా దూసుకొచ్చి.. వాహనదారులను, పాదచారులను పరుగులు పెట్టించింది. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో కదిరి పట్టణంలోకి సదరు లారీ ప్రవేశించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్… నిరాటంకంగా హారన్ కొడుతూ అతి వేగంగా దూసుకొచ్చాడు. గుర్తించిన స్థానికులు.. ప్రాణభయంతో పరుగులు పెట్టారు. మరి కొందరు యువకులు లారీ వెంటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు లారీని వెంబడించారు. మదనపల్లి వైపు నుంచి పులివెందులకు వెళ్లాల్సిన లారీని డ్రైవరు కదిరిలోని ఇందిరా గాంధీ కూడలి నుంచి హిందూపురం వైపు మళ్ళించాడు. వేగంలో వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. ప్రమాదం ధాటికి స్తంభం విరిగి నేలవాలింది. అదే స్తంభానికి ఆనుకుని ఉన్న మూడు బైక్స్‌పై నుంచి లారీ దూసుకుపోగా.. అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. హిందూపురం వైపు తీసుకువెళ్లాల్సిన లారీని.. పోలీసులను చూసిన డ్రైవరు తేరు బజారు మీదుగా మహాత్మా గాంధీ రోడ్డు వైపు మళ్ళించాడని పోలీసులు చెప్పారు. చివరికి… తమతోపాటు స్థానికులు చుట్టుముట్టగా.. పేరు సమీపంలో వాహనాన్ని నిలిపి పారిపోయేందుకు ప్రయత్నించాడన్నారు. స్థానికులు లారీ డ్రైవర్ ను పట్టుకున్నారని.. అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.

Kadiri Accident

Kadiri Accident

Also Read :  జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో మరోసారి పెరిగిన హీట్.. అగ్గి ఎక్కడ రాజుకుందంటే..?

 పోలీసులం అంటూ ఇన్నోవా ఆపారు, తనిఖీలు అంటూ అందర్నీ దింపారు.. కట్ చేస్తే