AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tadipatri: జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో మరోసారి పెరిగిన హీట్.. అగ్గి ఎక్కడ రాజుకుందంటే..?

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరుపై మండిపడుతున్నారు స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి. కౌన్సిలర్లు...

Tadipatri: జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో మరోసారి పెరిగిన హీట్.. అగ్గి ఎక్కడ రాజుకుందంటే..?
Jc Vs Peddareddy
Ram Naramaneni
|

Updated on: Jul 26, 2021 | 10:12 AM

Share

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరుపై మండిపడుతున్నారు స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి. కౌన్సిలర్లు కావాలంటే ఇస్తా.. కానీ బెదిరింపు రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. అసలు గొడవ ఎక్కడ రాజుకుందంటే… ఇటీవల తాడిపత్రి సీపీఐ కాలనీలోని మున్సిపల్ స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారని అధికారులు నోటీస్‌ జారీ చేశారు. మూడు రోజుల క్రితం మున్సిపల్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేతకు మార్కింగ్‌ కూడా ఇచ్చారు. అయితే వీరిలో టీడీపీకి సపోర్ట్‌ చేసిన సీపీఐ కౌన్సిలర్‌ కూడా ఉన్నారు. దీంతో విషయం తెలుసుకున్న మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌన్సిలర్లను వేధించడం పద్ధతి కాదని హెచ్చరించారు ప్రభాకర్‌రెడ్డి. ‘గత 30 ఏళ్లుగా వారంతా ఇక్కడ ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని, నీకు కౌన్సిలర్‌ కావాలంటే నేనే మీ పార్టీలోకి పంపిస్తానంటూ’ కామెంట్ చేశారు జేసీ. నోటీసులు ఇవ్వకుండా మార్కింగ్‌ చేయడం పద్దతి కాదని సూచించారు. వారి ఇళ్లను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని జేసీ వార్నింగ్‌ ఇచ్చారు,

మంగళవారం బాధితుల కోసం తహసిల్దార్‌ ఆఫీస్‌ ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. తనను మున్సిపల్‌ చైర్మన్‌ పదవి నుంచి దింపాలని చూస్తున్నారని, ఇంకా మూడు సంవత్సరాల ఆరు నెలలు తాను పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. కాగా గతంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య ఓ రేంజ్‌లో వార్ జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోసారి అలాంటి పరిస్థితులు వస్తాయేమో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కీలక హెచ్చరిక చేసిన టీటీడీ

భారీ మొసలిని చుట్టేసి అమాంతం మింగేసిన కొండ చిలువ… వామ్మో..!

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి