‘ప్రకృతి లేనిదే లైఫ్ లేదు’.. హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించక ముందు ఆమె చేసిన ట్వీట్

Himachal Landslide: హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా సంగ్లా-చిత్ కుల్ రోడ్డు వద్ద నిన్న జరిగిన దుర్ఘటనలో 9 మంది మరణించగా ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఒకరరైన 34 ఏళ్ళ దీపా శర్మ..

'ప్రకృతి లేనిదే లైఫ్ లేదు'.. హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించక ముందు ఆమె చేసిన ట్వీట్
Deepa Sharma Last Twitter

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా సంగ్లా-చిత్ కుల్ రోడ్డు వద్ద నిన్న జరిగిన దుర్ఘటనలో 9 మంది మరణించగా ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఒకరరైన 34 ఏళ్ళ దీపా శర్మ.. తన మరణానికి 25 నిముషాల ముందు ట్వీట్ చేస్తూ ఈ ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదని పేర్కొంది. వర్షాలు, వరదల బీభత్సంలో కొండ చరియలు, పెద్ద పెద్ద బండరాళ్లు విసురుగా వచ్చి ఈమె ఉన్న బండరాయిని ఢీ కొన్నాయి. అంతకు ముందు కూడా దీపా శర్మ చేసిన ట్వీట్స్ హృదయాన్ని కదిలించేవిగా ఉన్నాయి. ఇండియాకు చివరి సరిహద్దుల్లో తాను ఉన్నానని, ఇది దాటి సుమారు 80 కి.మీ. దూరం వెళ్తే టిబెట్ వస్తుందని, ఆ భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించుకుందని ఆమె పేర్కొంది. ఈ ప్రకృతికి సంబంధించిన దుర్ఘటనలో సంగ్లా-చిత్ కుల్ రోడ్డులోని ఓ బ్రిడ్జ్ చూస్తుండగానే కూలిపోయింది. ఆయుర్వేద ప్రాక్టీషనర్, రైటర్, న్యూట్రిషియన్ కూడా అయిన దీపా శర్మ తనకు మృత్యువు చేరువలోనే ఉందని ఏ మాత్రం ఊహించలేదని అంటున్నారు.

మహిళ హక్కుల కోసం తాను పోరాడుతున్నానని, కోవిడ్ పాండమిక్ సమయంలో ఎందరికో సహాయం చేశానని, తన సేవలను ఈ సమాజం గుర్తిస్తుందని ఆశిస్తున్నానని…ఇలా ఆమె ఎన్నో ట్వీట్స్ చేసింది. తన హామీలు, ఇష్టాఇష్టాలను కూడా ప్రస్తావించింది. తనకు ఫోటోగ్రఫీ అంటే ఎంతో మక్కువని, కొత్తవారితో కలిసిపోవాలని భావిస్తుంటానని వెల్లడించింది. కాగా ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వీరు సైట్ సీయింగ్ కోసం ఈ ప్రాంతానికి వచ్చి దుర్మరణం పాలయ్యారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Jayanthi Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యంతో సీనియర్ నటి జయంతి కన్నుమూత..

Ujjaini Mahankali Bonalu: రంగం భవిష్యవాణి… ఉజ్జయిని మహంకాళి బోనాలు 2021 లైవ్ వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu